Share News

విలక్షణం..విజయవాడ రూరల్‌

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:12 AM

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నవ ఎన్టీఆర్‌ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న విజయవాడ రూరల్‌ మం డలం వైవిధ్యమైన పాత్ర పోషించబోతోంది. ఎందుకంటే ఎన్టీఆర్‌ జిల్లా లో అంతర్భాగంగా ఉన్నప్పటికీ కృష్ణాజిల్లాతోనూ ఎన్నికల సంబంధాన్ని కలిగి విలక్షణ మండలంగా పేరుగాంచింది.

విలక్షణం..విజయవాడ రూరల్‌

రెండు పార్లమెంట్‌, 2 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి మండలం

జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన చిక్కుముడి.. ఆ దిశగానే ఎన్నికల ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో నవ ఎన్టీఆర్‌ జిల్లాలో అంతర్భాగంగా ఉన్న విజయవాడ రూరల్‌ మం డలం వైవిధ్యమైన పాత్ర పోషించబోతోంది. ఎందుకంటే ఎన్టీఆర్‌ జిల్లా లో అంతర్భాగంగా ఉన్నప్పటికీ కృష్ణాజిల్లాతోనూ ఎన్నికల సంబంధాన్ని కలిగి విలక్షణ మండలంగా పేరుగాంచింది. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయ వాడ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి, కృష్ణాజిల్లాలో మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. పార్లమెంట్‌ నియోజకవర్గాలే కాదు..ఈ మండలం రెండు జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉంది. ఎన్టీఆర్‌ జిల్లా పరిధిలో మైలవరం నియోజకవర్గం, కృష్ణాజిల్లాలో గన్నవరం నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఇలాంటి విలక్షణమైన మండలం ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తంలో విజయవాడ రూరల్‌ మాత్రమే ఉంది. భౌగోళికంగా జిల్లాల పునర్వి భజనలో చేసిన తప్పిదాలకు విజయవాడ రూరల్‌ మండలం జిల్లాల వారీగా చూస్తే రెండు ముక్కలు అయింది. ఒకే జిల్లాలో ఉన్నా .. రెండు వేర్వేరు జిల్లాల పరిధిలోకి గ్రామాలు వెళ్లిపోయాయి. విజయ వాడ రూరల్‌ మండలానికి చెందిన 16 గ్రామాలు ఎన్టీఆర్‌ జిల్లాలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ 16 గ్రామాల్లో గొల్లపూడి, రాయనపాడు, పైడూరుపాడు, జక్కంపూడి, వైఎస్సార్‌ గ్రామ పంచాయతీ, రామరాజ్య నగర్‌, కొత్తూరు తాడేపల్లి మొత్తం 7 గ్రామాలు ఎన్టీఆర్‌ జిల్లాలోని విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం, మైలవరం అసెంబ్లీ నియో జకవర్గం పరిధిలోకి వస్తున్నాయి. విజయవాడ రూరల్‌ మండలంలోని మరో 9 గ్రామాలు గూడవల్లి, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదం పాడు, రామవరప్పాడు, నున్న, పాతపాడు, పీ నైనవరం, అంబాపురం పంచాయతీలు గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మండ లంలో కిందటి పంచాయతీ ఎన్నికలకు ముందే రామరాజ్యనగర్‌, వైఎ స్సార్‌ గ్రామం పంచాయతీలు ఏర్పడినా వీటికి ఎన్నికలు జరగలేదు.

ప్రత్యేక నియోజకవర్గం చేయాలని డిమాండ్‌

విజయవాడ రూరల్‌ మండ లంలో అత్యధికంగా లక్షన్నర మంది ఓటర్లు ఉన్నారు. కృష్ణా జిల్లాలో పెడన నియోజకవర్గంతో దాదాపుగా సమానంగా ఓటర్లు ఉన్నారు. అందుకే విజయవాడ రూరల్‌ను ఎప్పటి నుంచో ప్రత్యేక నియోజకవర్గం చేయాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కాకినాడ రూరల్‌, రాజ మండ్రి రూరల్‌, నెల్లూరు రూరల్‌ తరహాలో విజయవాడ రూరల్‌ను కూడా ప్రత్యేక నియోజకవర్గంగా ప్రకటించాలన్న డిమాండ్‌ స్థాని కంగా రెండు దశాబ్దాలుగా డిమాండ్‌ వస్తోంది. విజయవాడ రూరల్‌ మండలం పరిధిలో ఎన్నికల ఏర్పాట్లను ఎన్టీఆర్‌ జిల్లా యంత్రాంగమే నిర్వహిస్తోంది.

Updated Date - Mar 24 , 2024 | 01:12 AM