వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి.. మరొకరికి గాయాలు
ABN , Publish Date - May 12 , 2024 | 01:13 AM
మండలంలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి.

జగ్గయ్యపేట రూరల్, మే 11: మండలంలో శనివారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. మరొకరికి గాయాలయ్యాయి. గండ్రాయి వద్ద బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో బాలుడు మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. జగ్గయ్యపేటకు చెందిన ఉప్పు ప్రసన్నకుమార్ (17), బాషా(18) వల్లభి నుంచి బైక్‌పై జగ్గయ్యపేట వస్తుండగా అది అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దీంతో ప్రసన్న అక్కడికక్కడే మృతిచెందాడు. బాషాకు గాయాల య్యాయి. అతనిని విజయవాడ ఆస్పత్రికి తరలించారు. మరో ఘటనలో జాతీయ రహదారిపై గౌరవరం వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో హైదరాబాద్‌కు చెందిన రెడ్డి సాయిప్రసాద్(65) అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడు, సమీప బంధువులతో కలిసి ఏలూరు నుంచి వెళ్తుండగా ఘటన జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చిల్లకల్లు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.