Share News

ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా నమోదు కావాలి

ABN , Publish Date - Jan 07 , 2024 | 12:56 AM

ట్రాన్స్‌జెండర్లు ఎన్టీఆర్‌ జిల్లాలో వెయ్యి మందికి పైగా ఉన్నారని, 147 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని, ఈనెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నందున మిగిలిన వారు కూడా ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు పిలుపునిచ్చారు.

ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా నమోదు కావాలి

ట్రాన్స్‌జెండర్లు ఓటర్లుగా నమోదు కావాలి

ఫ కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు

కృష్ణలంక, జనవరి 6: ట్రాన్స్‌జెండర్లు ఎన్టీఆర్‌ జిల్లాలో వెయ్యి మందికి పైగా ఉన్నారని, 147 మంది మాత్రమే ఓటర్లుగా నమోదయ్యారని, ఈనెల 22న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నందున మిగిలిన వారు కూడా ఓటు నమోదు చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు పిలుపునిచ్చారు. ఓటరుగా నమోదవడంలో ట్రాన్స్‌జెండర్లకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తామని, కలెక్టరేట్‌లో ప్రత్యేక నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌(స్వీప్‌) కార్యక్రమంలో భాగంగా శనివారం నగరంలోని కలెక్టరేట్‌ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ట్రాన్స్‌జెండర్లతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో రెవెన్యూ, డీఆర్డీఏ, గృహనిర్మాణం, నగరపాలక సంస్థ, సంక్షేమ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ట్రాన్స్‌జెండర్లకు ఇళ్లస్థలాలు, పింఛన్లు, రేషన్‌కార్డు మంజూరుతో పాటు బ్యాంకుల నుంచి రుణ సహాయం అందించి చిరు వ్యాపారాలు చేసుకునేలా చూస్తామని కలెక్టర్‌ తెలిపారు.

Updated Date - Jan 07 , 2024 | 12:56 AM