Share News

పదిమంది డీఎస్పీల బదిలీ

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:09 AM

ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి పదిమంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. అమలాపురం దిశ డీఎస్పీగా ఉన్న ఎస్‌.మురళీమోహన్‌ను మైలవరం ఏసీపీగా బదిలీ చేశారు. కాకినాడ డీఎస్పీగా ఉన్న పడాల మురళీకృష్ణారెడ్డిని విజయవాడ పశ్చిమ ఏసీపీగా నియమించారు. నూజివీడు డీఎస్పీ ఈ.అశోక్‌కుమార్‌ గౌడ్‌ను విజయవాడ-2 ట్రాఫిక్‌ ఏసీపీగా బదిలీ చేశారు.

పదిమంది డీఎస్పీల బదిలీ

విజయవాడ పశ్చిమ ఏసీపీగా మురళీకృష్ణారెడ్డి

ట్రాఫిక్‌ ఏసీపీగా అశోక్‌కుమార్‌ గౌడ్‌

మచిలీపట్నం డీఎస్పీగా రాంబాబు

విజయవాడ, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కృష్ణాజిల్లా నుంచి పదిమంది డీఎస్పీలు బదిలీ అయ్యారు. ఈ మేరకు డీజీపీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. అమలాపురం దిశ డీఎస్పీగా ఉన్న ఎస్‌.మురళీమోహన్‌ను మైలవరం ఏసీపీగా బదిలీ చేశారు. కాకినాడ డీఎస్పీగా ఉన్న పడాల మురళీకృష్ణారెడ్డిని విజయవాడ పశ్చిమ ఏసీపీగా నియమించారు. నూజివీడు డీఎస్పీ ఈ.అశోక్‌కుమార్‌ గౌడ్‌ను విజయవాడ-2 ట్రాఫిక్‌ ఏసీపీగా బదిలీ చేశారు. పోలవరం డీఎస్పీ జి.రత్నరాజును విజయవాడ సౌత్‌ ఏసీపీగా నియమించారు. కృష్ణాజిల్లా సీసీఎస్‌ డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణకు విశాఖపట్నం నార్త్‌ ఏసీపీగా పోస్టింగ్‌ ఇచ్చారు. విజయవాడ పశ్చిమ ఏసీపీగా ఉన్న డాక్టర్‌ కె.హనుమంతరావును కాకినాడకు బదిలీ చేశారు. విజయవాడ నార్త్‌ ఏసీపీగా ఉన్న సీహెచ్‌ రవికాంత్‌ను గుంటూరు నార్త్‌ డీఎస్పీగా నియమించారు. దిశ ఏసీపీ వీవీ నాయుడును గుంటూరు ట్రాఫిక్‌ డీఎస్పీగా పంపారు. విజయవాడ టాస్క్‌ఫోర్స్‌లో ఉన్న బీవీ సుబ్బరాజును గుంటూరు దిశ డీఎస్పీగా బదిలీ చేశారు. మైలవరం ఏసీపీగా ఉన్న మార్గాని రమేశ్‌ను గుంటూరు సీసీఎస్‌ డీఎస్పీగా నియమించారు. గుంటూరు నార్త్‌ డీఎస్పీ జవంగుల రాంబాబుకు మచిలీపట్నం డీఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. గుంటూరు సీసీఎస్‌ డీఎస్పీ కూరపాటి ప్రకాశ్‌బాబును విజయవాడ దిశ డీఎస్పీగా నియమించారు. సైబర్‌ క్రైం ఏసీపీ సీహెచ్‌ శ్రీనివాస రావును ప్రకాశం జిల్లా దిశ డీఎస్పీగా బదిలీ చేశారు. విజయవాడ ట్రాఫిక్‌-2 ఏసీపీ జె.వెంకట నారాయణను పశ్చిమగోదావరి జిల్లా ఎస్‌ఈబీకి పంపారు.

Updated Date - Feb 02 , 2024 | 01:09 AM