Share News

టాప్‌లేపారు

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:23 AM

ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాల్లో మన రెండు జిల్లాలు సత్తా చాటాయి. కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా, ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సర స్టేట్‌ టాపర్లు ఎన్టీఆర్‌ జిల్లాకు చెందినవారే కావడం విశేషం. ఇక మొత్తం ఉత్తీర్ణతలో ఎన్టీఆర్‌ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఈసారీ బాలికలే ముందువరుసలో నిలిచారు.

టాప్‌లేపారు

ఇంటర్‌ ఫలితాల్లో కృష్ణా ఫస్ట్‌, ఎన్టీఆర్‌ థర్డ్‌ ప్లేస్‌

ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ స్టేట్‌ టాపర్లు ఇద్దరూ ఎన్టీఆర్‌ జిల్లావారే..
కృష్ణాజిల్లాలో 90 శాతం ఉత్తీర్ణత

ఎన్టీఆర్‌ జిల్లాలో 87 శాతం ఉత్తీర్ణత

ఈసారి కూడా బాలికలదే పైచేయి

ఇంటర్మీడియెట్‌ పరీక్షా ఫలితాల్లో మన రెండు జిల్లాలు సత్తా చాటాయి. కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా, ఇంటర్‌ మొదటి, రెండో సంవత్సర స్టేట్‌ టాపర్లు ఎన్టీఆర్‌ జిల్లాకు చెందినవారే కావడం విశేషం. ఇక మొత్తం ఉత్తీర్ణతలో ఎన్టీఆర్‌ జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచింది. ఈసారీ బాలికలే ముందువరుసలో నిలిచారు.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : గత ఏడాది ఉమ్మడి జిల్లాలవారీగా ఫలితాలను వెల్లడించిన ఇంటర్మీడియెట్‌ బోర్డు ఈ ఏడాది కొత్తగా ఏర్పడిన జిల్లాలవారీగా విడుదల చేసింది. రాష్ట్రంలోనే ప్రథమ (కృష్ణాజిల్లా), తృతీయ (ఎన్టీఆర్‌ జిల్లా) స్థానాలను పక్కపక్క జిల్లాలు సాధించడం విశేషం. కృష్ణాజిల్లా.. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 90 శాతం, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతను సాధించింది. ఇక ఎన్టీఆర్‌ జిల్లా ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 87 శాతం, ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 79 శాతం ఉత్తీర్ణతను నమోదు చేసుకుంది. రెండు జిల్లాల్లోనూ బాలుర కంటే బాలికలదే పైచేయి.

కృష్ణాజిల్లాలో ఇలా..

కృష్ణాజిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు 9,955 మంది బాలురు హాజరవ్వగా, 8,197 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 10,369 మంది హాజరవ్వగా, 8,873 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 20,324 మంది పరీక్షలు రాయగా 17,070 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే, రెండో సంవత్సరం పరీక్షలకు 8,508 మంది బాలురు పరీక్షలు రాయగా, 7,653 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 8,917 మంది పరీక్షలకు హాజరవ్వగా, 8,035 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 17,425 మందికి 15,688 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో మొదటి ఏడాది పరీక్షలకు 168 మంది బాలురకు 101 మంది ఉత్తీర్ణులయ్యారు. 501 మంది బాలికలకు 359 మంది పాస్‌ అయ్యారు. మొత్తం 669 మందికి గాను 460 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 143 మంది బాలురు హాజరవ్వగా, 81 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 414 మంది హాజరవ్వగా, 350 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 557 మందికి 431 మంది ఉత్తీర్ణులయ్యారు.

ఎన్టీఆర్‌ జిల్లాలో ఇలా..

ఎన్టీఆర్‌ జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 21,217 మంది బాలురు హాజరవ్వగా, 16,558 మంది ఉత్తీర్ణుల య్యారు. బాలికలు 17,090 మంది హాజరవ్వగా, 13,795 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 38,307 మందికి 30,353 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం పరీక్షలకు బాలురు 18,892 మంది హాజరవ్వగా, 16,263 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 15,264 మందికి 13,444 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 34,156 మందికి 29,707 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరం పరీక్షలకు బాలురు 497 మంది హాజరవ్వగా, 219 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 521 మందికి 380 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 1,018 మందికి 599 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం పరీక్షలకు బాలురు 333 మందికి 196 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 370 మందికి 297 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 703 మందికి 493 మంది ఉత్తీర్ణత సాధించారు.

ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత

ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి కృష్ణాజిల్లాలో ఇంటర్‌ మొదటి సంవత్సరానికి సంబంధించి 197 బాలురు హాజరవ్వగా, 81 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 337 మంది హాజరవ్వగా, 192 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 534 మందికి 273 మంది పాస్‌ అయ్యారు. రెండో సంవత్సరానికి సంబంధించి 159 మంది బాలురు హాజరవ్వగా, 117 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 331 మందికి 240 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 490 మందికి 357 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరం పరీక్షలకు 61 మంది హాజరవ్వగా, 44 మంది ఉత్తీర్ణులయ్యారు. 185 మంది బాలికలకు 148 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 246 మందికి 192 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం పరీక్షలకు 61 మంది బాలురు హాజరవ్వగా, 47 మంది ఉత్తీర్ణులయ్యారు. 172 మంది బాలికలకు 155 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 233 మందికి 202 మంది ఉత్తీర్ణత సాధించారు. జూ ప్రభుత్వ కళాశాలలకు సంబంధించి ఎన్టీఆర్‌ జిల్లాలో మొదటి సంవత్సరం పరీక్షలకు 389 మంది బాలురు హాజరవ్వగా, 125 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 393 మంది పరీక్షలు రాయగా, 177 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 782 మందికి 302 మంది ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సరం పరీక్షలకు 213 మంది బాలురు హాజరు కాగా, 111 మంది ఉత్తీర్ణతను సాధించారు. 373 మంది బాలికలు హాజరవ్వగా, 240 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 586 మందికి 351 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్‌లో మొదటి సంవత్సరంలో 124 మంది బాలురు హాజరవ్వగా, 66 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 104 మందికి 90 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 228 మందికి గాను 156 మంది పాస్‌ అయ్యారు. రెండో సంవత్సరం పరీక్షలకు బాలురు 92 మంది హాజరవ్వగా, 61 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 82 మంది హాజరవ్వగా, 76 మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 174 మందికి 137 మంది పాస్‌ అయ్యారు.

కార్మికుల పిల్లలు.. స్టేట్‌ టాపర్లు..

ఒకరు.. ఇంటర్‌ మొదటి సంవత్సరంలో, మరొకరు.. రెండో సంవత్సరంలో స్టేట్‌ టాపర్లుగా నిలిచారు. ఇద్దరూ అమ్మాయిలే. మధ్యతరగతి కుటుంబాలకు చెందినవారే. ఒకే జిల్లాకు చెందినవారే. పైగా ఇద్దరి తండ్రులు ఆటోనగర్‌లో ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నవారే కావడం విశేషం. పటమటకు చెందిన పెదమల్లు మేఘన ఇంటర్‌ మొదటి సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు 467 మార్కులు సాధించింది. ఆమె తండ్రి ఉదయచంద్రరావు ఆటోనగర్‌లో ఎలక్ర్టీయన్‌. మేఘనకు చిన్నతనం నుంచి చదువుపై ఆసక్తి ఎక్కువ. ఆటోనగర్‌లో భారీ వాహనాలకు విద్యుత్‌ సౌకర్యాన్ని ఏర్పాటుచేసే ఉదయచంద్రరావు తన కుమార్తె చదువు విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా ప్రోత్సహించారు. ఇక ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో టాపర్‌గా నిలిచిన కె.ప్రసన్న 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించింది. ఈమె తండ్రి భాస్కరరావు కూడా ఆటోనగర్‌లో ఎలక్ట్రీషియనే. ఈ ఇద్దరూ బెంజిసర్కిల్‌లో నారాయణ ఐఐటీ ఈసీ ఏసీ బాలికల క్యాంపస్‌లో చదువుతున్నారు. వీరిని ఆర్జీఎం శ్రీనివాసరెడ్డి, ఏజీఎం వినయ్‌ అభినందించారు.

Updated Date - Apr 13 , 2024 | 01:23 AM