Share News

నేడు టీడీపీలోకి పార్థసారథి

ABN , Publish Date - Feb 26 , 2024 | 01:18 AM

పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సోమవారం టీడీపీలో చేరనున్నారు. ఆయనతోపాటు విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన బొప్పన భవకుమార్‌ కూడా పార్టీ కండువా కప్పుకోనున్నారు. పార్థసారథి, భవకుమార్‌ ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ అధినేత సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు.

నేడు టీడీపీలోకి పార్థసారథి

బొప్పన భవకుమార్‌ కూడా..

చంద్రబాబుతో సమావేశమైన దేవినేని ఉమా

వసంత చేరిక వాయిదా

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి సోమవారం టీడీపీలో చేరనున్నారు. ఆయనతోపాటు విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసిన బొప్పన భవకుమార్‌ కూడా పార్టీ కండువా కప్పుకోనున్నారు. పార్థసారథి, భవకుమార్‌ ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లి పార్టీ అధినేత సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. పార్థసారథికి నూజివీడు టికెట్‌ను ఇప్పటికే కేటాయించారు.

వీరితోపాటే టీడీపీలో చేరుతారని భావించిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ చేరిక మాత్రం మరికొన్ని రోజులు వాయిదా పడింది.

చంద్రబాబుతో ఉమా భేటీ

మరోవైపు మైలవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి దేవినేని ఉమా సోమవారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. మైలవరం నుంచి వసంతను బరిలోకి దింపే విషయమై వీరి నడుమ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉమాను ఒప్పించిన తర్వాతే వసంతను పార్టీలోకి చేర్చుకోవాలని పార్టీ అధినేత భావించడంతో వసంత చేరిక వాయిదా పడినట్టు సమాచారం. చంద్రబాబును కలిసిన అనంతరం ఉమా మాట్లాడుతూ ‘చంద్రబాబు కుటుంబ సభ్యుడిని నేను. చంద్రబాబు అంటే నాకు శిరోధార్యం’ అని అన్నారు. మరోవైపు బొమ్మసాని సుబ్బారావు ఆదివారం గొల్లపూడిలో తన అనుచరులతో సమావేశమయ్యారు. వసంత చేరికను వ్యతిరేకించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Updated Date - Feb 26 , 2024 | 01:18 AM