Share News

నేడు నామినేషన్లకు చివరి రోజు

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:12 AM

నామినేషన్లకు నేడే చివరి రోజు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి మొత్తం 176 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 21, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 155 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం మరో 24 నామినేషన్లు దాఖలైతే రెండొందలు దాటుతుంది.

నేడు నామినేషన్లకు చివరి రోజు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : నామినేషన్లకు నేడే చివరి రోజు. ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా బుధవారం నాటికి మొత్తం 176 నామినేషన్లు దాఖలయ్యాయి. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో 21, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 155 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం మరో 24 నామినేషన్లు దాఖలైతే రెండొందలు దాటుతుంది. ఆరోరోజు రికార్డు స్థాయిలో 58 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో పార్లమెంట్‌ పరిధిలో 11, అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 47 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆదివారం మినహాయిస్తే వరుసగా ఐదు రోజుల పాటు నామినేషన్ల జోష్‌ కనపడింది.

పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో 11

విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఆరో రోజు మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ తరపున కేశినేని శివనాథ్‌, కేశినేని జానకి లక్ష్మీలు నామినేషన్లు దాఖలు చేశారు. వైసీపీ తరపున కేశినేని శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్‌, నవతరం పార్టీ అభ్యర్థిగా వై.కృష్ణకిషోర్‌, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా ఎం.వెంకటేశ్వరరావు, జై భీమ్‌రావు పార్టీ అభ్యర్థిగా దాట్ల లూర్దు మేరీ, జనరాజ్యం అభ్యర్థిగా డి.కుమారి, ఆంధ్రరాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థిగా డి.రవీంద్రబాబు, స్వతంత్ర అభ్యర్థులుగా ఎం.వెంకటకనకారావు, పి.వెంకట అశోక్‌లు ఒక్కో సెట్టు నామినేషన్‌ దాఖలు చేశారు.

ఫ విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకరవర్గ పరిధిలో మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి బీజేపీ అభ్యర్థిగా యలమంచిలి సత్యనారాయణ చౌదరి(సుజనాచౌదరి) రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ పార్టీ అభ్యర్థిగా షేక్‌ కాజావలి, సీపీఐ అభ్యర్థిగా జి.కోటేశ్వరరావు, వైసీపీ అభ్యర్థిగా షేక్‌ ఆసిఫ్‌, ఆలిండియా ఫార్వర్డ్‌ పార్టీ అభ్యర్థిగా నాగెండ్ల దేవసహాయం, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా పోతిన వెంకటరామారావు, స్టూడెంట్‌ యునైటెడ్‌ ఫర్‌ నేషన్‌ అభ్యర్థిగా కాకాని వెంకటేశ్వరరావు, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా రమణ ప్రసాద్‌ కొత్తమాసు, స్వతంత్ర అభ్యర్థులుగా వినోద్‌కుమార్‌ ఎర్రబత్తుల, లొల్ల చంద్రశేఖర్‌లు ఒక్కో సెట్టు నామినేషన్లు దాఖలు చేశారు.

ఫ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 11 నామినేషన్లు దాఖలయ్యాయి. వైసీపీ తరపున వెలంపల్లి శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీవాణిలు, టీడీపీ తరపున బొండా ఉమామహేశ్వరరావు, బీఎ్‌సపీ అభ్యర్ధిగా ఐ.రాజేంద్రప్రసాద్‌, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థిగా గొల్లపల్లి ఫణిరాజ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వి.జయపూర్ణచంద్రరావు, కొణిజేటి ఆదినారాయణ, చంద్రశేఖర్‌ పెదపాటి దాసరి నాగరాజులు ఒక్కోసెట్టు నామినేషన్‌ దాఖలు చేశారు.

ఫ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్థులుగా గద్దె రామమోహన్‌, గద్దె క్రాంతి కుమార్‌లు, వైసీపీ తరపున దేవినేని అవినాశ్‌ నాలుగు సెట్లు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పి.నాంచారయ్య రెండు సెట్లు. జైభీమ్‌రావు పార్టీ భారత్‌ పార్టీ అభ్యర్థిగా ఎం.విజయశేఖర్‌, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా జత్తి వసుంధర, స్వతంత్ర అభ్యర్థిగా సిద్దెల అవినాశ్‌లు నామినేషన్లు దాఖలు చేశారు.

ఫ ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్థులుగా వసంత కృష్ణ ప్రసాద్‌ ఒక సెట్టు, బీసీవైపీ అభ్యర్ధిగా ముప్పసాని భూ లక్ష్మి రెండు సెట్లు, స్వతంత్ర అభ్యర్థులుగా పి.ప్రకా్‌షబాబు, భూక్యా కోటేశ్వరరావు, పి.దాశరఽథిలు నామినేషన్లు వేశారు.

ఫ తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 9 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ అభ్యర్ధులుగా కొలికలపూడి శ్రీనివాస్‌, కోట పుల్లమ్మలు, బీసీవైపీ అభ్యర్థులుగా సీహెచ్‌ వెంకటేశ్వరరావు, శ్రీకాకుళపు వెంకయ్య, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిగా లాం తాంతియా కుమారి, స్వతంత్ర అభ్యర్థులుగా వి.మెహర్‌బాబా, కొర్లపాటి రవీంద్రబాబు, కొలికపోగు వెంకట్రావు, కె.కృష్ణయ్యలు ఒక్కోసెట్టు నామినేషన్‌ దాఖలు చేశారు.

ఫ జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొత్తం 4 నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగుదేశం (టీడీపీ) అభ్యర్ధిగా శ్రీరాం రాజగోపాల్‌ ఒక సెట్టు, వైసీపీ అభ్యర్ధిగా సామినేని ఉదయభాను మూడుసెట్లు, వైసీపీ తరపున సామినేని విమల నామినేషన్‌ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా జిల్లేపల్లి సుధీర్‌బాబు ఒక సెట్టు నామినేషన్‌ వేశారు.

ఫ నందిగామ అసెంబ్లీ నియెజకవర్గం పరిధిలో కేవలం ఒకే ఒక్క నామినేషన్‌ దాఖలైంది. వైసీపీ తరపున మొండితోక జగన్మోహనరావు రెండు సెట్ల నామినేషన్‌ దాఖలు చేశారు.

కృష్ణా జిల్లాలో 57 నామినేషన్లు

మచిలీపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి) : కృష్ణా జిల్లాలో ఆరోరోజైన బుధవారం 57నామినేషన్లు దాఖలయ్యాయి. మచిలీపట్నం పార్లమెంటు జనసేనపార్టీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి రెండుసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. జైభీమ్‌రావు భారత్‌పార్టీ అభ్యర్థిగా పరిటాల వెంకటఫణిబాబు, కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా గొల్లు కృష్ణ, సంతంత్ర అభ్యర్థులుగా సైకం భాస్కరరావు, ధనేకుల గాంధీ ఒక్కోసెట్‌ నామినేషన్లను దాఖలు చేశారు.

ఫ గన్నవరం అసెంబ్లీ నియోజక వర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీమోహన్‌, స్వతంత్ర అభ్యర్థులుగా గుంటుపల్లి ఉమామహేశ్వరరావు, వల్లభనేని వంశీకృష్ణ, నర్నాల విజయదుర్గ, కొనగల శివదుర్గవరప్రసాద్‌, పొట్లూరి శ్రీదేవి నామినేషన్లను దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావ్‌, రిపబ్లికన్‌పార్టీ ఆఫ్‌ ఇండియా(అఽథవాలే)అభ్యర్థిగా పొట్లూరి రవీంద్రకుమార్‌, తెలుగు రాఽజాధికార సమితి అభ్యర్థిగా తాడంకి జగదీశ్‌ నామినేషన్‌లను దాఖలు చేశారు.

ఫ పెడన నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కాగిత కృష్ణప్రసాద్‌, కాగిత శిరీష ఒక్కోసెట్‌ నామినేషన్లను దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా ఉప్పాలరాము, రెండుసెట్లు, ఉప్పాల హారిక మూడుసెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.

ఫ మచిలీపట్నం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా కొల్లురవీంద్ర, కొల్లునీలిమ మూడుసెట్ల చొప్పున, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా సౌదాడ బాలాజీ, కాంగ్రె్‌సపార్టీ తరపున అబ్దుల్‌ మతీన్‌ ఒకసెట్‌ నామినేషన్లను దాఖలు చేశారు.

ఫ అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా అందె శ్రీరామమూర్తి, రెండుసెట్లు, అందె శ్రీవాణి ఒకసెట్‌ చొప్పున నామినేషన్లను దాఖలు చేశారు. అంబెడ్కర్‌ జైబీమ్‌రావు భారత్‌పార్టీ అభ్యర్థిగా సముద్రాల అంబెడ్కర్‌, వైసీపీ అభ్యర్ధులుగా సింహాద్రి రమే్‌షబాబు రెండుసెట్లు, సింహాద్రి వికాష్‌ ఒకసెట్‌, స్వతంత్ర అభ్యర్థిగా మండలి వెంకట్రావ్‌ ఒక నామినేషన్‌ను దాఖలు చేశారు

ఫ పెనమలూరు నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా జొన్నలగడ్డ సతీష్‌, మహాభారత్‌పార్టీ అభ్యర్థిగా మరదాని విజ్ఞయ్య నామినేషన్లను దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థిగా జోగిరమేష్‌ నాలుగుసెట్‌లు, జోగి రాజీవ్‌ రెండుసెట్‌లు, టీడీపీ అభ్యర్థిగా బోడె ప్రసాద్‌ ఒక సెట్‌ నామినేషన్లను దాఖలు చేశారు.

ఫ పామర్రు నియోజకవర్గం టీడీనీ అభ్యర్థిగా వర్ల కుమార్‌రాజా, వైసీపీ అభ్యర్థిగా కైలే జ్ఞానమణి, జైభీమ్‌రావ్‌ భారత్‌పార్టీ అభ్యర్థిగా కొడాలి సునీల, కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా డీవైదాస్‌, దోవారి అమర్నాథ్‌ ఒక్కో సెట్‌ నామినేషన్లను దాఖలు చేశారు

ఫ గుడివాడ నియోజకవర్గం జైభీమ్‌రావ్‌ భారత్‌పార్టీ అభ్యర్థిగా సింగవరపు జోసెఫ్‌, నవరంగ్‌ కాంగ్రె్‌సపార్టీ అభ్యర్థిగా పంది నాగార్జున, స్వతంత్ర అభ్యర్థులుగా గుండాబత్తిన అంబెడ్కర్‌, ఏచూరి వేణుగోపాలరావు, మీడగ రాము ఒక్కోసెట్‌ నామినేషన్‌న్‌లను దాఖలు చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 01:12 AM