Share News

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్‌ డీకే బాలాజీ

ABN , Publish Date - Apr 11 , 2024 | 12:38 AM

స్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు.

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్‌ డీకే బాలాజీ
గుడివాడ మార్కెట్‌యార్డులో స్ర్టాంగ్‌ రూమ్‌లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ డీకే బాలాజీ

గుడివాడ/పామర్రు, ఏప్రిల్‌ 10: స్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ డీకే బాలాజీ అన్నారు. బుఽధ వారం గుడివా, పామర్రు మార్కెట్‌ యార్డులలో నియోజకవర్గ ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేస్తున్న స్ర్టాంగ్‌ రూమ్‌లను ఆయన పరిశీలించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాలకు వేర్వేరుగా స్ర్టాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి పట్టిష్టమైన భద్రత కల్పించినట్లు ఆయన తెలిపారు. స్ర్టాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ కెమెరా లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు సీసీ ఫుటేజ్‌ను భద్రపరచాలని సూచించారు. గదుల వెంటిలేషన్‌ బాగుండాలని, కిటికీలు, డోర్లు పటి ష్టంగా ఉండాలని సూచించారు. పోలింగ్‌ సందర్భంగా సిబ్బందికి మెటీరియల్‌ పంపిణీ కోసం ఏర్పాటు చేసే రిసెప్షన్‌ ప్రదేశాలను కలెక్టర్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. గుడివాడలో రిటర్నింగ్‌ అధికారి పి.పద్మావతి, డీఎస్పీ పి.శ్రీకాంత్‌, తహసీల్దార్లు పాల్గొ న్నారు. పామర్రులో ఆర్వో బి.శ్రీదేవి, తహసీల్దార్‌ పిశ్రీపల్లవి, సీఐ శుభకర్‌, ఎస్సై పి.ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, సర్వేయర్‌ పర్వీన్‌ సుల్తాన, ఎన్నికల డీటీ పి.జగన్మోహనరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2024 | 12:38 AM