Share News

నేటి నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

ABN , Publish Date - Jan 29 , 2024 | 01:20 AM

సత్యనారాయణపురం ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీత సన్మండలి ఆధ్వర్యంలో సోమవారం నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

నేటి నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు

విజయవాడ కల్చరల్‌, జనవరి 28: సత్యనారాయణపురం ఘంటసాల ప్రభుత్వ సంగీత కళాశాలలో సంగీత సన్మండలి ఆధ్వర్యంలో సోమవారం నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నట్టు సంస్థ అధ్యక్షుడు మోదుమూడి సుధాకర్‌ తెలిపారు. ఇంటెలిజెన్స్‌ డీజీపీ సీతారామాంజనేయులు కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు.

సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌కు సత్కారం

డాక్టర్‌ వేటూరి సుందరరామమూర్తి 89వ జయంతిని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం గాంధీనగర్‌లోని వెలిదండ్ల హనుమంతరాయ గ్రంథాలయంలో సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌కు ఆత్మీయ సత్కారం నిర్వహిస్తామని నిర్వాహకుడు జయంతి చక్రవర్తి పేర్కొన్నారు.

Updated Date - Jan 29 , 2024 | 07:44 AM