Share News

అనుచితంగా ప్రవర్తించి..నాపై దాడి చేశారు

ABN , Publish Date - Apr 13 , 2024 | 01:23 AM

‘‘ఇటీవల ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర ్గ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు వెంట వచ్చిన ఆయన అనుచరులు నాతో అనుచితంగా ప్రవర్తించారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు నాపై దాడి చేసి, నిర్బంధించారు. చర్యలు తీసుకోండి’’ అని ఎన్నికల కమిషన్‌కు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేశ్‌ శుక్రవారం ఫిర్యాదు చేశారు.

అనుచితంగా ప్రవర్తించి..నాపై దాడి చేశారు
ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారికి ఫిర్యాదు చేస్తున్న డూండీ రాకేశ్‌

పోలీసులు, వెలంపల్లి అనుచరులపై చర్యలు తీసుకోండి

ఎన్నికల కమిషన్‌కు డూండీ రాకేశ్‌ ఫిర్యాదు

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 12: ‘‘ఇటీవల ఆర్యవైశ్య సంఘం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వైసీపీ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర ్గ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాసరావు వెంట వచ్చిన ఆయన అనుచరులు నాతో అనుచితంగా ప్రవర్తించారు. వైసీపీ నాయకుల ప్రోద్బలంతో పోలీసులు నాపై దాడి చేసి, నిర్బంధించారు. చర్యలు తీసుకోండి’’ అని ఎన్నికల కమిషన్‌కు టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేశ్‌ శుక్రవారం ఫిర్యాదు చేశారు. మాచవరం పోలీసుస్టేషన్‌ పరిధిలో సంఘటన జరిగితే పటమట పోలీసులు వచ్చి అత్యుత్సాహం ప్రదర్శిం చారని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకులు గొడవపడితే తన చొక్కా పట్టుకుని సీఐ మోహ నరెడ్డి రోడ్డుమీదకు తీసుకువచ్చారన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారన్నారు. ఇటువంటి అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటే పోలింగ్‌ ప్రశాంతంగా జరగదని రాకేశ్‌ తెలిపారు.

Updated Date - Apr 13 , 2024 | 01:23 AM