Share News

బరిలో నిలిచింది వీరే..

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:49 AM

పెడన ఆర్వో కార్యాలయంలో ఆర్వో పి.వెంకట రమణ పెడన నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్ల పరిశీలనను శుక్రవారం నిర్వహించారు.

బరిలో నిలిచింది వీరే..

పెడన, ఏప్రిల్‌ 26: పెడన ఆర్వో కార్యాలయంలో ఆర్వో పి.వెంకట రమణ పెడన నియోజకవర్గానికి దాఖలైన నామినేషన్ల పరిశీలనను శుక్రవారం నిర్వహించారు. పరిశీలన అనంతరం పెడన నియోజకవర్గంలో పది మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాగిత కృష్ణప్రసాద్‌ (టీడీపీ), ఉప్పాల రాము(వైసీపీ), శొంఠి నాగరాజు(కాంగ్రెస్‌), ఈడే కాశీ విశ్వేశ్వరరావు (బీఎస్పీ), సబ్బిశెట్టి రేవతీదేవి(పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), కాట్రగడ్డ విష్ణుమూర్తి(యుగతులసి పార్టీ), ఇండిపెండెంట్లుగా సమ్మెట వెంకన్న బాబు, సేనాపతి గోపి, రాజులపాటి జమదగ్ని, కాగిత శ్రీహరికృష్ణప్రసాద్‌ బరిలో నిలిచారు.

గుడివాడలో..

గుడివాడ: గుడివాడ అసెంబ్లీ నియోజక వర్గంలో నామినేషన్ల పరిశీలన అనంతరం 17మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. 9మంది నామినేషన్లను రిట్నరింగ్‌ అధికారి తిరస్కరిం చారు.

ఆమోదం పొందిన నామినేషన్లు

కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(వైసీపీ), వెనిగండ్ల రాము(టీడీపీ), వడ్డాది గోవిందరావు(కాంగ్రెస్‌), గుడివాడ బోసుబాబు(బీఎస్పీ), నల్లగంచు వెంకట రాంబాబు(జాతీయ జనసేన పార్టీ), పంది నాగరాజు(నవరంగ్‌ కాంగ్రెస్‌), హేమంత్‌ కుమార్‌ అల్లూరి(జై భారత్‌ నేషనల్‌ పార్టీ), ఆవుల ప్రవీణ్‌ కుమార్‌(తెలుగు రాజ్యధికార సమితి), స్వతంత్ర అభ్యర్ధులుగా గుండాబత్తిన అంబేడ్కర్‌, శిష్ట్లా దత్తాత్రేయులు, యేల్చూరి వేణుగోపాలరావు, తాళ్లూరి పెద్ద నాగేశ్వరరావు, కుమ్మరి భవన్నారాయణ, వడ్డాది నాగరాజు, హసన్‌ అహ్మ మద్‌ అబ్దుల్‌, కరీముల్లా షేక్‌ నామినేషన్లు ఆమోదం పొందాయి.

తిరస్కరణకు గురైన అభ్యర్థులు

వైసీపీ డమ్మీ అభ్యర్థి కొడాలి నాగేశ్వరరావు, టీడీపీ డమ్మీ వెనిగండ్ల రామ కృష్ణ, జై మహా భారత్‌ పార్టీ అభ్యర్థి మిట్టపల్లి వెంకట వంశీనరేష్‌, జై భీమ్‌రావ్‌ భారత్‌ పార్టీ అభ్యర్థి సింగవరపు జోసఫ్‌, స్వతంత్ర అభ్యర్థులు మెండా సుభాకరరావు, దుక్కిపాటి రాధాకృష్ణమూర్తి, కొడాలి వెంకటేశ్వరరావు, షేక్‌ కరీముల్లా, మీగడ రాము నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.

అవనిగడ్డలో..

అవనిగడ్డ: నామినేషన్ల పరిశీలన అనంతరం అవనిగడ్డ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను ఆర్వో బాలసుబ్రహ్మణ్యం ప్రకటిం చారు. అందె శ్రీరామ మూర్తి (కాంగ్రెస్‌), గుంటూరు నాగేశ్వ రరావు(బీఎస్పీ), సింహాద్రి రమేష్‌ బాబు(వైసీపీ), మండలి బుద్ధప్ర సాద్‌(జనసేన), సముద్రాల అం బేడ్కర్‌(జై భీమ్‌ భారత్‌ పార్టీ), బోయిన బుద్ధప్రసాద్‌(నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ), ముంగర వెంకట నాంచారయ్య(పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), ఇండిపెండెంట్లుగా నాదెళ్ల గిరిధర్‌నాయుడు, తాడంకి చంటి, లీలా మోహనరావు, వెంక ట్రామ్‌, పుష్పకుమార్‌ ఎన్నికల బరిలో నిలిచారని ఆర్వో పేర్కొ న్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:49 AM