Share News

కూటమి గెలుపునకు యువత విశేష కృషి

ABN , Publish Date - Jun 08 , 2024 | 01:32 AM

అడ్డంకులను, అక్రమ కేసులను అధిగమించి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కూటమి గెలుపునకుయువత విశేష కృషి చేశారని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు.

కూటమి గెలుపునకు యువత విశేష కృషి
యార్లగడ్డ వెంకట్రావును అభినందిస్తున్న రంగన్నగూడెం తెలుగుయువత

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, జూన్‌ 7: అడ్డంకులను, అక్రమ కేసులను అధిగమించి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ కూటమి గెలుపునకుయువత విశేష కృషి చేశారని యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. విజయవాడలోని కార్యాలయంలో యార్లగడ్డ వెంకట్రావును రంగన్నగూడెం తెలుగుయువత సభ్యులు శుక్రవా రం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. దాడు లకు భయపడకుండా నియోజకవర్గ పోల్‌ మేనేజ్‌మెఒంట్‌ కో ఆర్డి నేటర్‌గా ఆళ్ల గోపాలకృష్ణ పనిచేశారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధితో పాటు యువత భవిష్యత్తుకు సహకారమంది స్తానని తెలిపారు. ఆళ్లను శాలువాతో సత్కరించారు. తెలుగు యువత నాయకులు వెనిగళ్ల జ్ఞానశేఖర్‌, మందపాటి రాంబాబు, ఆళ్ల లీలాకృష్ణ, నెరుసు వెంకటేశ్వరరావు, ఆళ్ల మనోజ్‌కుమార్‌, కొలుసు రంగారావు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2024 | 01:32 AM