Share News

ప్రణాళికాబద్ధంగా చదవడమే నా విజయ రహస్యం

ABN , Publish Date - May 26 , 2024 | 12:43 AM

ప్రణాళికబద్ధంగా చదవడమే తన విజ యానికి కారణమని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) 74వ ర్యాంకు సాధించిన తుమ్మల కృష్ణచైతన్య అన్నారు.

ప్రణాళికాబద్ధంగా చదవడమే నా విజయ రహస్యం
తుమ్మల కృష్ణచైతన్య దంపతులకు సన్మానం చేస్తున్న రంగన్నగూడెం గ్రామస్థులు

పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తా

ఐఎఫ్‌ఎస్‌ 74వ ర్యాంకర్‌ తుమ్మల కృష్ణచైతన్య

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, మే 25: ప్రణాళికబద్ధంగా చదవడమే తన విజ యానికి కారణమని, పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తానని ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌) 74వ ర్యాంకు సాధించిన తుమ్మల కృష్ణచైతన్య అన్నారు. రంగన్న గూడెంలో రంగన్నగూడెం రూరల్‌ డవలప్మెంట్‌ సొసైటీ(ఆర్‌ఆర్‌డీఎస్‌) ఆధ్వర్యంలో గ్రామస్థులు శనివారం తుమ్మల కృష్ణచైతన్య, లక్ష్మీశ్రీలేఖ దంపతులకు పౌరసన్మానం చేశారు. ఆళ్ల గోపాలకృష్ణ అధ్వక్షతన అభినందన సభ నిర్వహించారు. సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన కృష్ణచైతన్య ఐఎఫ్‌ఎస్‌ 74వ ర్యాంకు సాధిం చడం అభినందనీయమని ఆళ్ల గోపాలకృష్ణ, తెలుగురైతు కార్యదర్శి గుండపనేని ఉమావరప్రసాద్‌ అన్నారు. తల్లిదండ్రుల సహకారం, భార్య ప్రోత్సాహంతోనే ఉద్యోగం చేస్తూ 4వ ప్రయత్నంలో ఐఎఫ్‌ఎస్‌లో 74వ ర్యాంకు సాధించానని కృష్ణచైతన్య తెలిపారు. ఆర్‌ఆర్‌డీఎస్‌ అధ్యక్షుడు తుమ్మల దశరథరామయ్య, సర్పంచ్‌ కసుకుర్తి రంగామణి, మందాడి రవీంద్ర, కొమ్మారెడ్డి కిషోర్‌, తుమ్మల ఉదయ్‌, లిం గం నవీన్‌, మొవ్వా వేణుగోపాల్‌, కసుకుర్తి వెంకటశాస్ర్తులు, మొవ్వా శ్రీనివాస రావు, తుమ్మల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:43 AM