Share News

ఎమ్మెల్యే పదవి వెంట్రుకతో సమానం

ABN , Publish Date - Apr 25 , 2024 | 01:12 AM

వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి తాలూకు అసహనం కనిపిస్తోంది. గెలుపు అసాధ్యమని అర్థం కావడంతో తన మన అని చూడకుండా సొంత పార్టీ నాయకులపైనా బూతులతో దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జగ్గయ్య పేటకు చెందిన ఓ వైసీపీ నాయకుడు పార్టీ కార్యకర్తల వద్ద ఐదేళ్లలో ఒక్క పని చేయలేకపోయామని, ఇప్పుడు పరిస్థితి అంత అనుకూలించడం లేదని, గెలుపు కష్టమేనని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే పదవి వెంట్రుకతో సమానం

నీవు అనవసరంగా కామెంట్లు చేయడం మానెయ్‌

సొంత పార్టీ నాయకుడిపై సామినేని ఉదయభాను బూతుపురాణం

(విజయవాడ - ఆంధ్రజ్యోతి) వైసీపీ అభ్యర్థుల్లో ఓటమి తాలూకు అసహనం కనిపిస్తోంది. గెలుపు అసాధ్యమని అర్థం కావడంతో తన మన అని చూడకుండా సొంత పార్టీ నాయకులపైనా బూతులతో దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం జగ్గయ్య పేటకు చెందిన ఓ వైసీపీ నాయకుడు పార్టీ కార్యకర్తల వద్ద ఐదేళ్లలో ఒక్క పని చేయలేకపోయామని, ఇప్పుడు పరిస్థితి అంత అనుకూలించడం లేదని, గెలుపు కష్టమేనని వ్యాఖ్యానించారు. ఈ విషయం జగ్గయ్యపేట వైసీపీ అభ్యర్థి సామినేని ఉదయభాను దృష్టికి వెళ్లడంతో ఆయన ఆగ్రహోదగ్రుడయ్యారు. ఆ దళిత నాయ కుడికి ఫోన్‌ చేసి బూతులతో విరుచుకుపడ్డారు. ‘నాకు ఎమ్మెల్యే పదవి వెంట్రుక ముక్కతో సమానం. నీవు అనవసరంగా కామెంట్లు చేయడం మానెయ్‌. అదృష్టం ఉంటే గెలుస్తాం.. లేకుంటే ఓడిపోతాం. ఎలా అవ్వాలో అలా అవ్వుద్ది.. బొచ్చులో మంత్రి.. అది.........తో సమానం. గెలిచినా ఓడినా నాకు బొచ్చుతో సమానం’ అంటూ రెచ్చిపోయారు. ప్రస్తుతం ఈ ఆడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దళితులపై ఉదయభాను నోరుపారేసుకోవడం ఇది రెండోసారి. గతంలో సొంత పార్టీకి చెందిన గిరిజన దివ్యాంగుడిని బండబూతులు తిట్టిన ఉదంతంలో ఉదయ భానుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. తాజాగా సొంత పార్టీకే చెందిన దళిత నాయకుడిపై నోరుపారేసుకోవడంతో వైసీపీ శ్రేణులే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Updated Date - Apr 25 , 2024 | 01:12 AM