గన్నవరం నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,77,132
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:43 AM
ఓటర్ల జాబితా సవరణ చేశాక గన్నవరం నియోజకవర్గంలో 2,77,132 మంది ఓటర్లు ఉన్నారని ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గోపాలరెడ్డి తెలిపారు.

గన్నవరం, జనవరి 11: ఓటర్ల జాబితా సవరణ చేశాక గన్నవరం నియోజకవర్గంలో 2,77,132 మంది ఓటర్లు ఉన్నారని ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ గోపాలరెడ్డి తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గురువారం తహసీల్దార్ కార్యాలయంలో గోపాలరెడ్డి అధ్యక్షతన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. అక్టోబరులో ప్రచురించిన తుది జాబితాకు అదనంగా 12,976 మంది ఓటర్లుగా నమోదయ్యారని, ఇంకా 3,560 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని గోపాలరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు నియోజకవర్గ వ్యాప్తంగా చేర్పుల కోసం ఫాం-6 దరఖాస్తులు 23,818 రాగా, 19025 ఆమోదం పొందాయని, తొలగింపులకు ఫాం-7 దరఖాస్తులు 10,046 రాగా 9,403 దరఖాస్తులు ఆమోదించామని తెలిపారు. టీడీపీ నియోజకవర్గ పోల్ మేనేజ్‌మెంట్ కో- ఆర్డినేటర్ ఆళ్ల గోపాల కృష్ణ, నాదిండ్ల మోహన్, కళ్లం వెంకటేశ్వరరావు బొబ్బవరపు శ్రీనివాసరావు, వేములపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు.