ఆలయమంతా పసిడి కాంతులు
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:12 AM
కనకదుర్గమ్మ దేవస్థానం మొత్తం బంగారు తాపడం చేయించేందుకు సన్నాహాలు విరాళాల కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు వన్‌టౌన్,ఏప్రిల్ 2 : ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మవారి ఆలయ గోడలకు బంగారుతాపడం చేసేందుకు ఆలయ ఈవో రామారావు సంకల్పించారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయగోపురం వరకు మాత్రమే బంగారు తాపడం ఉంది.

కనకదుర్గమ్మ దేవస్థానం మొత్తం బంగారు తాపడం చేయించేందుకు సన్నాహాలు
విరాళాల కోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు
వన్‌టౌన్,ఏప్రిల్ 2 : ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మవారి ఆలయ గోడలకు బంగారుతాపడం చేసేందుకు ఆలయ ఈవో రామారావు సంకల్పించారు. ప్రస్తుతం అమ్మవారి ఆలయగోపురం వరకు మాత్రమే బంగారు తాపడం ఉంది. అయితే సగం మాత్రమే ఉన్న బంగారుతాపడాన్ని దిగువ వరకు కూడా అంటే చుట్టూగోడలకు కూడా బంగారు తాపడం చేయడం వల్ల మరింత కాంతులీనుతుందని ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ క్రమంలో విరాళంగా బంగారం సేకరించే నిమిత్తం దేవస్థానంలో నడుస్తున్న అన్నదాన ట్రస్ట్ తరహాలో కొత్తగా శ్రీకనకదుర్గ డవలప్‌మెంట్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ట్రస్ట్‌ను రిజిస్టర్ చేసినట్టు సమాచారం. బంగారాన్ని దాతలు కొత్తగా ఏర్పడిన ట్రస్ట్‌కు మాత్రమే జమ చేయాల్సి ఉంటుంది. ట్రస్ట్‌కు ఇచ్చే విరాళాలకు సెక్షన్ 80జీ కింద ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటుంది.