Share News

గెలుపు రథసారథులు... రావి, వెనిగండ్ల

ABN , Publish Date - Jun 06 , 2024 | 01:24 AM

పదేళ్లుగా గుడివాడలో టీడీపీ జెండాను రెపరెపలాడించాలని చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అధినేతల ఆదేశం, నేతల పట్టుదల, కార్యకర్తల్లో కసి కలిసొచ్చాయి. టీడీపీలో కొడాలి నానీని ఓడించి తీరుతామని భీష్మ ప్రతిజ్ఞ చేసిన రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము తమ మాట నిలబెట్టుకున్నారు.

గెలుపు రథసారథులు... రావి, వెనిగండ్ల

గుడివాడ : పదేళ్లుగా గుడివాడలో టీడీపీ జెండాను రెపరెపలాడించాలని చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. అధినేతల ఆదేశం, నేతల పట్టుదల, కార్యకర్తల్లో కసి కలిసొచ్చాయి. టీడీపీలో కొడాలి నానీని ఓడించి తీరుతామని భీష్మ ప్రతిజ్ఞ చేసిన రావి వెంకటేశ్వరరావు, వెనిగండ్ల రాము తమ మాట నిలబెట్టుకున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, యువనేత లోకేష్‌ల పిలుపు మేరకు వీరిరువురు నాలుగుసార్లు గెలిచి తనకు నియోజకవర్గంలో ఎదురులేదనుకొన్న కొడాలి నానీని ఘోరంగా ఓడించారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టినప్పుడు తొలిసారి తన సొంత నియోజక వర్గమైన గుడివాడ (అప్పట్లో నిమ్మకూరు గుడివాడలో అంతర్భాగం) నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత గుడివాడ నుంచి ఆయన వారసులుగా రావి వెంకటేశ్వరరావు తండ్రి రావి శోభనాద్రి చౌదరి, ఆ తర్వాత రావి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ సిఫార్సుతో రావి వెంకటేశ్వరరావును కాదని కొడాలి నాని టీడీపీ బీ ఫాం పొందగలిగారు. రెండుసార్లు టీడీపీ తరఫున గెలిచిన కొడాలి నాని తన స్వార్ధం కోసం వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో మంత్రి అయ్యాక వైసీపీ పెద్దలను సంతోషపెట్టేందుకు ఏకంగా చంద్రబాబు, లోకేష్‌లతోపాటు టీడీపీ అధినేత సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో టీం టీడీపీ అంతా కొడాలి ఓటమిపైనే దృష్టిపెట్టింది. రాష్ట్రంలో ఎక్కడ గెలిచినా, గెలవక పోయినా గుడివాడలో గెలిచి తీరాలని కార్యకర్తలను టార్గెట్‌గా పెట్టారు. ఆ టార్గెట్‌ను 50 వేలకుపైగా మెజార్టీ సాధించిన రావి, వెనిగండ్లను అభినవ కృషార్జునులుగా కార్యకర్తలు వర్ణిస్తున్నారు.

Updated Date - Jun 06 , 2024 | 01:24 AM