Share News

బిల్డప్‌ నాని

ABN , Publish Date - Apr 03 , 2024 | 01:14 AM

చుట్టూ వంద మంది భజన బృందం... ప్రతి పది ఇళ్లకోసారి మంగళ హారతి... అక్కడక్కడా కాళ్లకు పాలాభిషేకం... ఇదీ గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని కొత్త తరహా ప్రచారార్భాటం. ఈ తరహా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైసీపీ అభ్యర్థి కొడాలి నాని బిల్డప్‌ చూసి పట్టణవాసులు ఆశ్చర్యపోతున్నారు.

బిల్డప్‌ నాని

సొంత వారితో హారతులు, పాలాభిషేకాలు

ప్రజలే స్వచ్ఛందంగా చేస్తున్నట్టు హంగామా

గుడివాడ: చుట్టూ వంద మంది భజన బృందం... ప్రతి పది ఇళ్లకోసారి మంగళ హారతి... అక్కడక్కడా కాళ్లకు పాలాభిషేకం... ఇదీ గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని కొత్త తరహా ప్రచారార్భాటం. ఈ తరహా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న వైసీపీ అభ్యర్థి కొడాలి నాని బిల్డప్‌ చూసి పట్టణవాసులు ఆశ్చర్యపోతున్నారు. రోజుకో రకంగా బిల్డప్‌లతో బజర్దస్త్‌ను మించిని కామెడీని ఎంజాయ్‌ చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో కొత్త ఎత్తుగడకు నాని శ్రీకారం చుట్టారు. రెండున్నరేళ్లు మంత్రిగా, మరో రెండున్నరేళ్లు ఎమ్మెల్యేగా నాని గుడివాడ నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యం. ఈ విషయంలో నియోజకవర్గ ప్రజలు పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఆరు రోజులుగా ప్రచారం చేస్తున్నా ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో తానేదో గుడివాడ అభివృద్ధి ప్రధాత అనే రేంజ్‌లో ఏకంగా వైసీపీ శ్రేణులతో పాదాలకు పాలాభిషేకాలు చేయించుకుంటున్నారు. పార్టీ అభిమానులు, సొంత మనుషులతో డబ్బులిచ్చి పాలాభిషేకాలు తెరలేపారు. ప్రచారానికి వచ్చిన వారికి పూర్తిస్థాయిలో చికెన్‌ భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రచారంలో తన వెంట వందమంది ఉండేలా పక్కా ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి పది ఇళ్లకు ఒకసారి హారతి పట్టేలా, మెడలో పూలదండులు వేసేలా ఏర్పాట్లు భేషుగ్గా చేసుకున్నారని గుడివాడ టాక్‌.

Updated Date - Apr 03 , 2024 | 01:14 AM