డివైడర్‌ను ఢీకొన్న బైక్
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:31 AM
జగ్గయ్యపేటలో ఇంజనీరింగ్ చదువుతున్న ప్రకాశం జిల్లా విద్యార్థి చిల్లకల్లు వద్ద బైక్‌పై వెళుతూ డివైడర్‌ను ఢీకొని దుర్మరణం చెందిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది.

జగ్గయ్యపేట, జూన్ 6 : జగ్గయ్యపేటలో ఇంజనీరింగ్ చదువుతున్న ప్రకాశం జిల్లా విద్యార్థి చిల్లకల్లు వద్ద బైక్‌పై వెళుతూ డివైడర్‌ను ఢీకొని దుర్మరణం చెందిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. ప్రకాశం జిల్లా వెంగాయ పాలేనికి చె ందిన రాములపల్లి శ్రీనివాస్ (20) జగ్గయ్యపేటలో మండవ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎ్‌సఇ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం రాత్రి ఇదే కళాశాలలో చదువుతున్న తెలంగాణా రాష్ట్రం సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన డే స్కాలర్‌గా చదువుతున్న సలీం బైక్ పై టిఫిన్ చేసి వస్తామని వెళ్లారు. రాత్రి భోజనం వేళకు రాకపోవడంతో శ్రీనివాస్ మిత్రులు, హాస్టల్ మేట్స్ అతడికి ఫోన్ చేశారు. జగ్గయ్యపేట నుంచి చిల్లకల్లు రోడ్డులో ఎంపీడీవో కార్యాలయం సమీపంలో డివైడర్‌ను ఢీకొని రక్తపు మడుగులో పడి ఉన్న శ్రీనివాస్ పోన్ రింగ్ కావటంతో స్థానికులు ప్రమాద విషయాన్ని చెప్పారు. హుటాహుటిన వారు బైక్ పైనే శ్రీనివా్‌సను జగ్గయ్యపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధృవీకరించారు. సలీంకు కాలు ఫ్రాక్చర్ అయినట్టు తెలిసింది. మృతదేహానికి చిల్లకల్లు ఎస్సై సతీష్ గురువారం పోస్ట్‌మార్టమ్ అనంతరం బంధువులకు అప్పగించారు. వ్యవసాయ కూలీ అయిన వెంకటేశ్వర్లుకు ఒక్కగానొక్క కొడుకు శ్రీనివాస్. ఎంతో ఇబ్బంది పడి కొడుకును చదివిస్తున్నామని, మంచి ఉద్యోగంతో ఆదుకుంటాడనుకున్న కొడుకు దుర్మరణం చెందటంపై కన్నీటి పర్యంతమయ్యారు. కళాశాల హాస్టల్‌లో భద్రత ఉంటుందని చేర్పిస్తే.. నిర్లక్ష్యంగా బయటకు పంపించారని, అదే తమ కొంప ముంచిందన్నారు.