అధికారుల తీరు మారాల్సిందే
ABN , Publish Date - Jul 28 , 2024 | 01:04 AM
కృష్ణాజిల్లాలో పనిచేస్తున్న అధికారుల పనితీరుపై మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.

జడ్పీ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
కృష్ణాజిల్లాలో పనిచేస్తున్న అధికారుల పనితీరుపై మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా పరి షత్ కన్వెన్షన్ హాలులో శనివారం జడ్పీ సర్వసభ్య సమావేశంలో వారు మాట్లాడారు. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చి 50రోజులపైనే అయిందని, కలెక్టర్ మినహా మిగిలిన అధికారుల తీరు మారలేదని, తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని వారు అన్నారు. సమస్యలపై అధికారులతో మాట్లాడితే రూల్ పొజిషన్ చెబుతున్నారే తప్ప, సమస్యలను పరిష్కరించేందుకు ఆసక్తి చూపడం లేదని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు.
ఇప్పటికీ కొందరు అధికారులు వైసీపీ నాయకులకు అనుకూలమే
వైసీపీ నాయకులకు మేలుచేయాలని కొందరు అధికారులు గతంలో మచిలీపట్నం నియోజకవర్గంలో దొంగ ఇంటి పట్టాలను విచ్చలవిడిగా మంజూరు చేశారు. దీనిపై ఇప్పటికే విచారణకు ఆదేశించాం. మరికొందరు నేటికీ వైసీపీ నాయకులకు అనుకూలం గానే పనిచేస్తున్నారు. వారు రాష్ట్రంలో ఎక్కడ పనిచేసినా వదలి పెట్టం. కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో భూఆక్రమణలు, ఇత రత్రా అంశాల్లో నిజాలు వెలుగులోకి రాకుండా వైసీపీ నాయకు లకు అనుకూలంగా కొందరు రెవెన్యూ అధికారులు పనిచేస్తు న్నారు. కలెక్టర్ దృష్టిసారించాలి.
- మంత్రి కొల్లు రవీంద్ర
తీరప్రాంతానికి సాగునీరందించాలి
వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటిని సక్రమంగా విడుదల చేయకపోవడంతో అవని గడ్డ నియోజకవర్గంలోని కోడూరు, నాగాయ లంక మండలాల్లో 5వేల ఎకరాల్లో గతేడాది పంటలు సాగుచేయలేదు. ఈ ఏడాదీ అదే పరిస్థితి ఉండేలా నీటి పారుదలశాఖ అధికా రుల వ్యవహారశైలి కనిపిస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో అవుట్‌ఫాల్ స్లూయిస్‌ల నిర్మాణానికి అంచనాలు ఇప్పటికీ రూపొందించకపోతే ఎలా? డ్రెయినేజీలు, పంటకాలువల నిర్వహణ పనులను సక్రమంగా చేయడం లేదు.
- మండలి బుద్ధప్రసాద్, అవనిగడ్డ ఎమ్మెల్యే
అధికారులు అందుబాటులో ఉండరు
జిల్లాలో కలెక్టర్ మినహా మిగిలిన అధికా రులెవరూ ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉండ టం లేదు. ప్రజాసమస్యలను పరిష్కరించాలని కోరితే అధికారులు సరైన విధంగా స్పందించ డం లేదు. మల్లవల్లిలో పారిశ్రామికవాడలో పరిశ్రమల అభివృద్ధికి సహరించాలి.
- యార్లగడ్డ వెంకట్రావ్, గన్నవరం ఎమ్మెల్యే
తాగునీటి చెరువులు నింపలేదు
ఇటీవల జిల్లాలో భారీవర్షాలు కురిశాయి. కాలువలకు తాగునీటి అవసరాలకోసం నీటిని విడుదల చేశారు. అయినా తాగునీటి చెరు వులు నింపలేదు. ప్రశ్నిస్తే కాలువలద్వారా నీరు రావడంలేదని నీటిపారుదలశాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు ఇంకా వైసీపీ నాయకుల బాటలోనే ప్రయాణం చేయడం బాధాకరం. ఎమ్మెల్యేలకు అధికారులు అందుబాటులో ఉండాలి. గుడివాడ ఏరియా ఆస్పత్రిలో ఇటీవల ఇద్దరు బాలిం తలు మరణిస్తే వారు ఏ కారణాలతో మరణించారో వైద్యశాఖ అధికారులు తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
- వెనిగండ్ల రాము, గుడివాడ ఎమ్మెల్యే
సాగునీరు సక్రమంగా అందించడం లేదు
సాగునీటి విడుదలలో నీటిపారుదలశాఖ అధికారులకు సరైన అంచనాలు లేవు. పామర్రు నియోజకవర్గంలోని పంటపొలాలకు సాగునీటిని అందించాలని కోరితే అధికారులు స్పందించడం లేదు. నియోజకవర్గంలోని ఐనం పూడి డ్రెయిన్‌లో పూడికతీయాలని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదు. విద్యాశాఖ అధికారులు తీరు మరీ విడ్డూరంగా ఉంది. నిమ్మకూరు పాఠశాలలో లెక్కల మాస్టారును మరో పాఠశాలకు పంపారు. ఈ మాస్టారును ఇక్కడకు పంపా లని విద్యాశాఖ అధికారులకు మూడుసార్లు వినతిపత్రాలుఇచ్చి నా, ఏడుసార్లు ఫోన్‌లో మాట్లాడినా ఇంతవరకు ఉపాధ్యా యుడిని ఏర్పాటు చేయలేదు.
- వర్ల కుమార్‌రాజా, పామర్రు ఎమ్మెల్యే
రూల్‌పొజిషన్ చెప్పి తప్పించుకుంటున్నారు
పెడన నియోజకవర్గం మొత్తం వ్యవసాయం, ఆక్వాసాగు ఆధారిత ప్రాంతం. గ్రామా ల్లో సమస్యలపై అధికారులతో మాట్లాడితే రూల్ పొజిషన్ చెప్పి తప్పించుకునే ప్రయ త్నం చేస్తున్నారు. పరిష్కరించేందుకు ముం దుకు రావడం లేదు. కాలువ శివారు ప్రాం తంలో ఉన్న పెడన నియోజకవర్గంలోని మండలాలకు సాగునీటిని అందించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారు. రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదు.
-కాగిత కృష్ణప్రసాద్, పెడన ఎమ్మెల్యే