Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

టీడీపీ హయాంలోనే ముస్లింల అభ్యున్నతి

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:05 AM

‘‘టీడీపీ ప్రభుత్వ హయాంలో సెంట్రల్‌ నియోజకవర్గంలో ముస్లింల అభ్యు న్నతికి జరిగిన కృషిని ఆధారాలతో సహా నిరూపిస్తాం. దీనిపై దమ్ముంటే ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, వైసీపీ సెంట్రల్‌ ఇన్‌ చార్జి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావులు చర్చకు రావాలి’’ అని టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ మైనార్టీ నేతలు సవాల్‌ విసిరారు. మూడేళ్ల కాలంలో మైనార్టీలకు ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా ఏం చేశారో చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు.

టీడీపీ హయాంలోనే ముస్లింల అభ్యున్నతి

దమ్ముంటే రుహుల్లా, వెలంపల్లి చర్చకు రావాలి

మైనార్టీలంతా బొండా ఉమా వైపే..

ఆయనను భారీ మెజారిటీతో గెలిపిస్తాం: టీడీపీ సెంట్రల్‌ మైనార్టీ నేతలు

అజిత్‌సింగ్‌నగర్‌, మార్చి 3: ‘‘టీడీపీ ప్రభుత్వ హయాంలో సెంట్రల్‌ నియోజకవర్గంలో ముస్లింల అభ్యు న్నతికి జరిగిన కృషిని ఆధారాలతో సహా నిరూపిస్తాం. దీనిపై దమ్ముంటే ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, వైసీపీ సెంట్రల్‌ ఇన్‌ చార్జి, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావులు చర్చకు రావాలి’’ అని టీడీపీ సెంట్రల్‌ నియోజకవర్గ మైనార్టీ నేతలు సవాల్‌ విసిరారు. మూడేళ్ల కాలంలో మైనార్టీలకు ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా ఏం చేశారో చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని టీడీపీ సెంట్రల్‌ కార్యాల యంలో నియోజకవర్గ మైనార్టీ నేతలు ఆదివారం విలేకరుల సమా వేశాన్ని నిర్వహించారు. శుక్రవారం జరిగిన టీడీపీ- జన సేన విస్తృత సమావేశంలో ముస్లింలకు సరైన ప్రాధాన్యం ఇవ్వలే దని వక్రీకరిస్తూ జగన్‌ పత్రికలో విషపు రాతలు రాశా రని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింలకు వైసీపీ ప్రభు త్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడంతో మైనా ర్టీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని వెలంపల్లి గ్రహించి, తన అను కూల నీలిమీడియాలో అసత్య వార్తలు రాయిస్తు న్నారని టీడీపీ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షుడు అన్వర్‌, ప్రధాన కార్యదర్శి గౌస్‌ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా నియోజకవర్గంలోని మైనార్టీలం దరూ బొండా ఉమా వైపు ఉన్నారని రాబోయే ఎన్నికల్లో ఆయనను అత్యధిక మెజారిటీతో గెలిపించు కుంటామని వారు స్పష్టం చేశారు.

Updated Date - Mar 04 , 2024 | 01:05 AM