తహసీల్దార్ రమణయ్య హత్య కేసు నిందితులను కఠినంగా శిక్షించాలి
ABN , Publish Date - Feb 06 , 2024 | 01:31 AM
తహసీల్దార్ రమణయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సోమవారం రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె.రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు వినతి పత్రమిచ్చారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావుకు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వినతి
వన్‌టౌన్, ఫిబ్రవరి 5: తహసీల్దార్ రమణయ్యను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావుకు సోమవారం రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కె.రమేష్‌కుమార్ ఆధ్వర్యంలో నాయకులు వినతి పత్రమిచ్చారు. భూమి విలువ అత్యధికంగా పెరిగిన ప్రాంతాలలో అధికా రులు, ఉద్యోగులకు తక్షణమే భద్రత కల్పించాలన్నారు. అధికారులు, ఉద్యో గులు నివాసం ఉండడానికి సమీకృత రెవెన్యూ క్వార్టర్లు నియమిం చాలని, తగిన భద్రత ఏర్పాటు చేయాలని ప్రతిజిల్లాలో భూ రికార్డులు అందుబాటులో ఉండేలా చూడాలని, అక్రమణల తొలగింపులో ఐఏఎస్, ఐపీఎస్‌లతో ప్రత్యేక విభాగాలను జిల్లాలో నియమించాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలంలో స్వయం ప్రతిపత్తి కలిగిన న్యాయవిభాగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. భూ వివాదాలు ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంత సెన్సిటివ్‌గా గుర్తించిన మండలాల్లో తగినంత సిబ్బందిని నియమించాలన్నారు. రమణయ్య కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని కోరారు.