సమష్టి కృషితో సత్ఫలితాలు
ABN , Publish Date - Apr 03 , 2024 | 01:06 AM
సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో అధికారులు సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా అన్నారు. ఎన్నికల నేపధ్యంలో ఈసీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి స్పెషల్ అబ్జర్వర్‌గా నియమించిన రామ్మోహన్ మిశ్రా మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, ఎంసీఎంసీ, సోషల్ మీడియా విభాగాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దిల్లీరావు, పోలీసు కమిషనర్ కాంతి రాణాటాటా, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు.

కృష్ణలంక, ఏప్రిల్ 2 : సాధారణ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలో అధికారులు సమన్వయంతో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర ప్రత్యేక పరిశీలకుడు రామ్మోహన్ మిశ్రా అన్నారు. ఎన్నికల నేపధ్యంలో ఈసీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి స్పెషల్ అబ్జర్వర్‌గా నియమించిన రామ్మోహన్ మిశ్రా మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం, ఎంసీఎంసీ, సోషల్ మీడియా విభాగాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దిల్లీరావు, పోలీసు కమిషనర్ కాంతి రాణాటాటా, ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. కంట్రోల్ రూంలోని సీ-విజిల్, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ ట్యాక్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఈఎ్‌సఎంఎస్), కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను దిల్లీరావు, కాంతిరాణాలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్పెషల్ జనరల్ అబ్జర్వర్‌కు వివరించారు. ఈసారి ఎన్నికల్లో జిల్లాలో 85శాతం ఓటింగ్ లక్ష్య్గంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ఏప్రిల్ 13, 14 తేదీల్లో సెషన్ల వారీగా పీవో, ఏపీవోలకు శిక్షణకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. అదేవిధంగా పోలీసు కమిషనర్ జిల్లాలో ఎలక్షన్ సీజర్లను, శాంతిభధ్రతల పరిరక్షణకు తీసుకున్న చర్యలను వివరించారు. పోలీస్ కంట్రోల్ రూంను రామ్మోహన్ మిశ్రా పరిశీలించారు.
అధికారుల పనితీరు అభినందనీయం
జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్ నేతృత్వంలోని ఎన్నికల బృందాల పనితీరును మిశ్రా అభినందించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే డేటాను విశ్లేషించి కార్యాచరణ దిశగా అడుగులేయాలన్నారు. అనంతరం కలెక్టర్ దిల్లీరావు మాట్లాడుతూ, మిశ్రా సూచనలతో జిల్లాలో ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేస్తామన్నారు.
అనంతరం మిశ్రా గూడవల్లిలోని ఇంటర్ డిస్ర్టిక్ట్ బోర్డర్ చెక్‌పోస్టును సందర్శించి సిబ్బందితో మాట్లాడారు. అక్కడ విధుల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ పి.సంపత్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, డీఆర్‌వో వి.శ్రీనివాసరావు, ఆర్డీవో భవానీశంకర్ తదితరులు పాల్గొన్నారు.