Share News

వైసీపీకి కౌంట్‌డౌన్‌

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:27 AM

మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరుతున్నారని, నియోజకవర్గంలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభమయిందని మాజీ మంత్రి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు.

వైసీపీకి కౌంట్‌డౌన్‌
పెదపట్నంలో కొల్లు రవీంద్ర సమక్షంలో టీడీపీలో చేరిన యువకులు

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 19 : మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరుతున్నారని, నియోజకవర్గంలో వైసీపీకి కౌంట్‌డౌన్‌ ప్రారంభమయిందని మాజీ మంత్రి, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. బందరు మండలం పెదపట్నంలో శుక్రవారం రాత్రి 42 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. క్లస్టర్‌ ఇన్‌ఛార్జి లంకే శేషగిరి ఆధ్వర్యంలో జరిగిన దాసి విజయకుమార్‌, దాసి ప్రభుదాసు, దేవదత్తం, మందపాటి అజయ్‌, మందపాటి రాంబాబు, గడ్డం చంద్ర య్య, దాసి బాబూరావు, మువ్వల స్వామినాథం, మాదాసు దొరబాబు, తోకల నవీన్‌ తదితరులు టీడీపీలో చేరారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ఐదేళ్ల వైసీపీ పాలనలో పెదపట్నం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. సాగునీటి సమస్యతో పెదపట్నం రైతులు కొట్టుమిట్టాడన్నారు. తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, కుంచే నాని, మీనవల్లి నాగేశ్వరరావు, గడిదేసి రవి, ఏసుబాబు, బురకా బాలాజీ, శివ, అయ్యప్ప, లంకే హరికృష్ణ, జనసేన నాయకుడు మాదివాడ రాము తదితరులు పాల్గొన్నారు.

అర్తమూరులో వైసీపీ నుంచి టీడీపీలో చేరిక

బంటుమిల్లి : అర్తమూరు గ్రామానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ నాయకత్వంలో శుక్రవారం టీడీపీలో చేరారు. కాగిత అమర్‌నాధ్‌, కాగిత రాంబాబు, యార్లగడ్డ రాంబాబు, తోకల స్వాములు, పోలగాని వెం కట కృష్ణారావు టీడీపీలో చేరారు. యార్లగడ్డ శ్రీనివాసరావు వైసీపీ ఆవిర్బావం నాడు పార్టీలో చేరి పార్టీ టిక్కెట్టు ఆశించి భంగపడి టీడీపీలో చేరారు. సామాన్య కార్యకర్తలు భారీ స్థాయిలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో అర్తమూరులో మరింత బలం పుంజుకుంది.

కాగిత సతీమణి శిరీష ప్రచారం

పెడన రూరల్‌ : వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ది ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని, భవిష్యత్‌ తరాలకోసం రాష్ర్టాన్ని కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉం దని పెడన నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్‌ భార్య శిరీష అన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులతో కలిసి గురివిందగుంట, దావోజిపాలెంలో సూపర్‌ సిక్స్‌ పథకాలను ప్రజలకు వివరించారు. అర్జా నగేష్‌, శలపాటి ప్రసాద్‌, శీరం ప్రసాద్‌, పుట్టి శ్రీనివాసరావు, కాగిత లక్ష్మీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:27 AM