Share News

సైకోను ఓడించడానికి మహిళలు ఏకం కావాలి

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:36 AM

రాష్ర్టాన్ని ఐదేళ్లుగా పట్టిపీడిస్తున్న సైకో జగన్‌రెడ్డిని ఓడించడానికి రాష్ట్ర మహిళలందరూ ఏకం కావాలని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ పిలుపునిచ్చారు. నియోజకవర్గ మహిళానేత మేడసాని రత్నకుమారి అధ్యక్షతన సోమవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి తెలుగు మహిళల సదస్సులో ఆయన మాట్లాడారు.

 సైకోను ఓడించడానికి మహిళలు ఏకం కావాలి
మహిళా నేతల సదస్సులో మాట్లాడుతున్న బోడె ప్రసాద్‌

పెనమలూరు, ఏప్రిల్‌ 29 : రాష్ర్టాన్ని ఐదేళ్లుగా పట్టిపీడిస్తున్న సైకో జగన్‌రెడ్డిని ఓడించడానికి రాష్ట్ర మహిళలందరూ ఏకం కావాలని టీడీపీ కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ పిలుపునిచ్చారు. నియోజకవర్గ మహిళానేత మేడసాని రత్నకుమారి అధ్యక్షతన సోమవారం పోరంకి టీడీపీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి తెలుగు మహిళల సదస్సులో ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు అనుమోలు ప్రభాకరరావు మాట్లాడుతూ, మహిళల సమగ్రాభివృద్ధికి పాటుపడిన పార్టీ టీడీపీ మాత్రమేనని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరు ఎమ్మెల్యేగా బోడె ప్రసాద్‌ను, ముఖ్యమంత్రిగా చంద్రబాబును ఎన్నుకోవాలని కోరారు. కార్యక్రమంలో యార్లగడ్డ సుచిత్ర, మల్లంపాటి విజయలక్ష్మి, జువ్వా రాంబాబు, ప్యారీ లతీఫ్‌, వేమూరి స్వరూపారాణి, షకీలా, బూ క్యా బిచాలి, నెరుసు రాజ్యలక్ష్మి, పందిపాటి ఇందిర, నాగశ్రీ, పండ్రాజు సుధారాణి, విజయకుమారి, కంచర్ల సుకన్య, బొప్పన నీరజ, సుంకర శ్రీదేవి, శివపార్వతి, కళ్యాణి, శేషుకుమారి పాల్గొన్నారు.

ముదునూరులో

ఉయ్యూరు : టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వంతో రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని కూట మి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. ముదునూరులో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామ సర్పంచ్‌ వెంకటలక్ష్మి, పార్టీ అధ్యక్షుడు దూసర అజయ్‌, వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌, వి సత్యనారాయణ, శేఖర్‌, శ్రీనివాసరావు, సత్యనారాయణ పాల్గొన్నారు.

20 కుటుంబాలు టీడీపీలో చేరిక

ముదునూరులో వైసీపీ నుంచి టీడీపీ, జనసేనలో కూటమిలో చేరికల పరంపర కొనసాగుతుంది. గ్రామానికి చెందిన మాజీ పీఏసీఎస్‌ అధ్యక్షుడు పాలడుగు సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌లు పల్లపోతు శ్రీనివాసరావు, మొవ్వ జ్ఞానశేఖర్‌ ఆధ్వర్యంలో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన 20 కుటుంబాలు సోమవారం టీడీపీలో చేరారు. చిందా నాగరాజు, బ్రహ్మరాజు, దళపతి ఈశ్వరరాజు, హను మంతరాజు, బి అంకమరాజు, పిచ్చిరాజు, వెంకటేశ్వర రాజు, సీహెచ్‌ కోటమరాజు, కృష్ణమూర్తిరాజు, శివ కృష్ణ, మురళీకృష్ణ, జస్వంత్‌, సాయి టీడీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో పార్టీ గ్రామ అధ్యక్షుడు దూసర అజయ్‌, రవీంద్ర, సాంబశివరావు పాల్గొన్నారు.

ఫ చంద్రబాబునాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యున్న తి సాధ్యమని టీడీపీ క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌ కూనపరెడ్డి వాసు అన్నారు. ఉయ్యూరు 9వ వార్డులో సోమవారం సూపర్‌సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు.

ఫ పదవ వార్డులో నగరపంచాయతీ కౌన్సిలర్‌ పలియాల శ్రీనివాసరావు సూప ర్‌సిక్స్‌ పథకాలపై అవగాహన కల్పించారు. ఇంటింటా ప్రచారం చేస్తూ మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి, పెనమలూరు అసెంబ్లీ అభ్యర్థి బోడె ప్రసాద్‌కు ఓట్లువేసి గెలిపించాలని అభ్యర్థించారు.

అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపాలి

కంకిపాడు : అవినీతి ప్రభుత్వాన్ని సాగనం పాల్సిన అవసరముందని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ సతీమణి బోడె హేమ, కుమార్తె వైష్ణవి అన్నారు. పెనమలూరు మండలంలోని గంగూరులో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. వారి వెంట అబ్దుల్‌ సలీం, ఫరా, ప్యారే లతీష్‌, పల్లె సందీప్‌, మట్టా సురేష్‌, కాటూరి కిషోర్‌, నాగరాజు, పండు బాబు, గౌసు, బాల స్వామి, అక్రం తదితరులు పాల్గొన్నారు. ఫ కంకిపాడులో నిర్వహించిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో సీనియర్‌ టీడీపీ నాయకులు పులి శ్రీని వాసరావు, గోగినేని వెంకటరమణ, బండి నాంచా రయ్య, వణుకూరు విక్రం, షేక్‌ బాజి, గుమ్మడి కిరణ్‌, బొర్రా వెంకట్‌ పాల్గొన్నారు.ఫ కుందేరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బోడె వెంకట్రామ్‌, మండపాటి రాజు, షేక్‌ నాగులమీరావలి, చలసాని వెంకటేశ్వరరావు, రాజు, ఆళ్ల నాని, నాగులు, మీరావాలి, శ్రీనివాస రావు, బొమ్మారెడ్డి, షేక్‌ మస్తాన్‌వలి పాల్గొన్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:36 AM