Share News

సైకో పాలనలో యువత పెడదోవ

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:45 AM

రాష్ట్ర యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకుండా కల్తీ మద్యం సరఫరాతో పాటు గంజాయి లాంటి మత్తుమందులతో వారిని పెడదోవ పట్టించింది సైకో జగన్‌రెడ్డి ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ దుయ్యబట్టారు. ఆదివారం పోరంకి టీడీపీ కార్యాలయంలో యనమలకుదురు, తాడిగడప గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

సైకో పాలనలో యువత పెడదోవ
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న బోడె ప్రసాద్‌

మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌

వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

పెనమలూరు, మార్చి 10 : రాష్ట్ర యువతకు సరైన ఉపాధి అవకాశాలు కల్పించకుండా కల్తీ మద్యం సరఫరాతో పాటు గంజాయి లాంటి మత్తుమందులతో వారిని పెడదోవ పట్టించింది సైకో జగన్‌రెడ్డి ప్రభుత్వమేనని మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ దుయ్యబట్టారు. ఆదివారం పోరంకి టీడీపీ కార్యాలయంలో యనమలకుదురు, తాడిగడప గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు భారీ ఎత్తున టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పు డూ, లేనప్పుడూ తాను ప్రజల మధ్యే ఉన్నానని, కాల్వకట్టపై నివసిస్తున్న ప్రజల బాగోగులను పరిశీలించి వారికి కావాల్సిన సదుపాయాల కల్పనకు కృషి చేసినట్టు తెలిపారు. ప్రజలు ఛీకొడితే రెండు నియోజకవర్గాలు మారి మూడో నియోజకవర్గంలోకి వచ్చి పడ్డ జోగి రమేష్‌ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నా డని, ప్రతి ఒక్క వర్గానికీ మాటలు చెబుతున్నాడని ఎద్దేవా చేశారు. తాను చేసిన అభివృద్దే తప్ప గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏమీ జరగలేదనే విషయాన్ని ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్ర అభివృద్ది ప్రదాత చంద్రబాబు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రకటించిన మేనిఫెస్టోలోని అంశాలను వివరించి వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

యార్లగడ్డ ఆధ్వర్యంలో 500 మంది చేరిక

ఉంగుటూరు/ గుణదల : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతల నియంతృత్వ పోకడలకు, ప్రజావ్యతిరేక విధానాలకు విసిగి ఆ పార్టీకి చెందిన పలువురు ముఖ్యనాయకులు యార్లగడ్డ చెంతకు చేరుకుంటున్నారు. ఫలితంగా యార్లగడ్డ వెంకట్రావు కార్యాలయం వద్ద వైసీపీ నేతల క్యూ రోజురోజుకు పెరిగిపోతుంది. తాజాగా ఆదివారం గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయి. పెద అవుటపల్లికి చెందిన 20 కుటుంబాల వైసీపీ కార్యకర్తల తోపాటు, మండలంలోని ఆత్కూరు, పొట్టిపాడు, నారయ్యఅప్పారావుపేట, గారపాడు, నాగవరప్పాడు గ్రామాలకు చెందిన 500మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రసాదంపాడులోని విజయవాడ రూరల్‌ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు కండు వాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ జనసేన నాయకులు కొండేటి కొండలు, వెంకటేశ్వరరావు, గరికపాటి శివశంకర్‌, ఆళ్ల హనోక్‌, మున్నా రామకృష్ణ, మండవ రమ్యకృష్ణ, గూడవల్లి నరసయ్య, బొప్పన హరికృష్ణ, పరుచూరి నరేష్‌, యార్లగడ్డ విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:45 AM