రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీకి మద్దతు పలకండి
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:46 AM
‘పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగే సత్తా టీడీపీకే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు. యువత భవిష్యత్‌ను వైసీపీ పాలకులు అంధకారంలోకి నెట్టారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో 20లక్షల ఉద్యోగాలు సృష్టించాని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. యువత భవిష్యత్తుతో పాటు రాష్ట్రాభివృద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలకండి.’ అని ప్రజలకు టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు.

ప్రజలకు టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి యార్లగడ్డ వెంకట్రావు పిలుపు
హనుమాన్‌జంక్షన్‌రూరల్, జనవరి 11: ‘‘పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసి, యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించగలిగే సత్తా టీడీపీకే ఉంది. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వడంలేదు. యువత భవిష్యత్‌ను వైసీపీ పాలకులు అంధకారంలోకి నెట్టారు. అధికారంలోకి రాగానే ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాల్లో 20లక్షల ఉద్యోగాలు సృష్టించాని టీడీపీ లక్ష్యంగా పెట్టుకుంది. యువత భవిష్యత్తుతో పాటు రాష్ట్రాభివృద్ధి జరగాలంటే వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు పలకండి.’ అని ప్రజలకు టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్ చార్జి యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు. టీడీపీ రేమల్లె గ్రామ కమిటీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన బాబు ష్యూరిటీ- భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామ కూడ లిలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి ఇంటింటికీ వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజలకు అండగా నిలుస్తూ సేవలందించేందుకే రాజకీయాల్లో కొనసా గుతున్నానని, అక్రమార్జన కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తు ప్రశార్థకంగా మార్చిన ఘనత వైసీపీ పాలకులదేనన్నారు. రాష్ట్రంలోనే నిరుద్యోగ పట్టభద్రులు 36 శాతం ఉన్నట్లు సీఎంఐ సర్వేలో తేలిందన్నారు. యనమదల శ్రీనివాసరావు, గుడివాడ విజయానంద్, యనమదల సుధాకర్, కలపాల కుమార్, దొంతు చిన్నా, వేములపల్లి శ్రీనివాసరావు, యనమదల వెంకయ్యారావు, ఆళ్ల గోపాలకృష్ణ, మూల్పూరి సాయి కల్యాణి, గుండపనేని ఉమావరప్రసాద్, దయాల రాజేశ్వరరావు, పుట్టా సురేష్, కలపాల సూర్యనారాయణ, తాటిపాముల నాగయ్య, లింగవరపు లోకేష్, వంశీ, తుమ్మల ఉదయ్, కలపాల రాధాకృష్ణ పాల్గొన్నారు.