Share News

వృద్ధుడి ఆత్మహత్య

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:07 AM

పెరికీడు వద్ద ఏలూరు కాలువ సమీపంలో ఒక వృద్ధుడు బుధవారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందాడు

వృద్ధుడి ఆత్మహత్య

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, జూలై 4: పెరికీడు వద్ద ఏలూరు కాలువ సమీపంలో ఒక వృద్ధుడు బుధవారం సాయంత్రం అనుమానాస్పదంగా మృతి చెందాడు. ‘‘ఎస్‌ఎన్‌ పాలేనికి చెందిన వజ్రపు సింహాచలం(65) కొన్నేళ్లుగా రైస్‌ మిల్లులో పనిచేస్తూ ఒంటరిగా జీవిస్తున్నాడు. వ్యక్తిగత కార ణాల వల్ల పురుగుల మందు తాగి అత్యహత్య చేసుకున్నాడు. మృతదేహం పక్కనే పురుగుమందుల డబ్బా ఉంది. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నాం.’’ అని హనుమాన్‌జంక్షన్‌ ఏఎస్సై సుబ్బా రావు తెలిపారు.

Updated Date - Jul 05 , 2024 | 01:07 AM