Share News

సజావుగా డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పరీక్ష

ABN , Publish Date - May 26 , 2024 | 12:54 AM

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఆధ్వ ర్యంలో శనివారం ఏపీ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ విభాగంలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం ఎన్టీఆర్‌ జిల్లాలో పరీక్షను సజావుగా నిర్వహించామని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు తెలిపారు.

సజావుగా డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ పరీక్ష

ఎన్టీఆర్‌ జిల్లాలో 1460 మందికి 888 మంది హాజరు

కృష్ణలంక, మే 25: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఏపీపీఎస్సీ) ఆధ్వ ర్యంలో శనివారం ఏపీ ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్‌ విభాగంలోని డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కోసం ఎన్టీఆర్‌ జిల్లాలో పరీక్షను సజావుగా నిర్వహించామని కలెక్టర్‌ ఎస్‌.దిల్లీరావు తెలిపారు. 1460 మందికి 888 మంది హాజరయ్యారని ఆయన పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ఎనిమిది పరీక్ష కేంద్రాలలో నిర్వహించినట్లు తెలి పారు. పరీక్షను ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.

కృష్ణాజిల్లాలో పరీక్ష రాసింది 61 శాతం మంది..

మచిలీపట్నం టౌన్‌: కృష్ణాజిల్లాలో 8 పరీక్షా కేంద్రాల్లో శనివారం నిర్వహిం చిన డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసరు పరీక్షలకు 61 శాతం అభ్యర్థులు హాజరయ్యా రని అధికారులు తెలిపారు. 2,370 మందికి 1,434 మంది హాజరయ్యారని, 936 మంది గైర్హాజరయ్యారని వారు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ విధానంలో ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. మచిలీపట్నం ఎస్వీహెచ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో 100 మందికి 65 మంది, నందమూరు వాసవీ ఇంజనీరింగ్‌ కళాశాలలో 180 మందికి 110, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్‌ కళాశాలలో 102 మందికి 43, రామవరప్పాడు శ్రీవిజయ దుర్గా ఐటీ ఇన్‌ఫో సొల్యూషన్స్‌లో 268 మందికి 166, కానూరు సైలేష్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో 331 మం దికి 169, కానూరు వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కాలేజిలో 200 మం దికి 128, గంగూరు ధనేకుల ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో 230 మందికి 151, కానూరు అయాన్‌ డిజిటల్‌ జోన్‌ సంస్థలో 959 మందికి 602 మంది హాజరయ్యారని తెలిపారు.

Updated Date - May 26 , 2024 | 12:54 AM