పీఎం సూర్యఘర్‌కు సబ్సిడీ, రుణాలు
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:09 AM
పీఎం సూర్యఘర్ కార్యక్రమంలో భాగంగా సౌర విద్యుత్ పథకం కింద విద్యుత్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు సబ్సిడీతో పాటు బ్యాంకు రుణ సౌకర్యం అందిస్తామని ఎలక్ట్రికల్ ఎస్‌ఈ ఎం.సత్యానందం పేర్కొన్నారు. గురువారం ఎస్‌ఈ కార్యాలయంలో విద్యుత్‌శాఖ డీఈలు, ఏడీలతో సోలార్ ఎనర్జీ వినియోగంపై వినియోగదారులకు అవగాహన కల్పించడంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

జిల్లాలో పథకం అమలుకు 36 బృందాలు
ఎలక్ట్రికల్ ఎస్‌ఈ సత్యానందం
మచిలీపట్నం టౌన్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి) : పీఎం సూర్యఘర్ కార్యక్రమంలో భాగంగా సౌర విద్యుత్ పథకం కింద విద్యుత్ కనెక్షన్ తీసుకునే వినియోగదారులకు సబ్సిడీతో పాటు బ్యాంకు రుణ సౌకర్యం అందిస్తామని ఎలక్ట్రికల్ ఎస్‌ఈ ఎం.సత్యానందం పేర్కొన్నారు. గురువారం ఎస్‌ఈ కార్యాలయంలో విద్యుత్‌శాఖ డీఈలు, ఏడీలతో సోలార్ ఎనర్జీ వినియోగంపై వినియోగదారులకు అవగాహన కల్పించడంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్‌ఈ మాట్లాడుతూ, ప్రతి ఇంటిని సూర్యఘర్ పథకంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కృష్ణాజిల్లాలోని 36 సెక్షన్లలో 36మంది సెక్షన్ ఆఫీసర్లు, 72 మంది ఇతర సిబ్బంది బృందాలుగా ప్రతీ ఇంటికి వెళ్లి వినియోగదారులను చైతన్య పరుస్తారన్నారు. కిలోవాట్ పవర్ కోరుకునే వారికి రూ. 30వేలు, రెండు కిలోవాట్ పవర్ కోరుకునే వారికి రూ.60 వేలు, మూడు కిలోవాట్లు విద్యుత్ కావాలనుకునే వారికి రూ.78 వేలు సబ్సిడీ ఇస్తారన్నారు. పీఎం సూర్య పథకంలోకి వచ్చిన వారి మిగులు విద్యుత్‌ను విద్యుత్ శాఖ కొనుగోలు చేసి బ్యాంకు అకౌంట్‌కు ఆ సొమ్మును జమ చేస్తారన్నారు. సోలార్ కనెక్షన్ తీసుకున్న వినియోగదారునికి ప్రస్తుతం ఉన్న ఎనర్జీ మీటర్ స్థానంలో బైడైవర్షన్ మీటర్‌ను పెడతారన్నారు. లక్ష రూపాలయకు రూ.80 వేలు బ్యాంకు రుణం ఇస్తుందని, మిగిలిన రూ.20 వేలు కట్టిన వెంటనే కనెక్షన్ ఇస్తారన్నారు. కార్యక్రమంలో డీఈలు జీబీ శ్రీనివాసరావు, డి.కృష్ణ నాయక్, బీవీ సుధాకర్‌లతో పాటు ఎడీలు, ఏఈలు పాల్గొన్నారు.