Share News

సుబ్బారాయుడి పవిత్రోత్సవాలు ప్రారంభం

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:56 AM

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్తికా మహోత్సవాలు శని వారం వైభవంగా ప్రారంభ మయ్యాయి.

సుబ్బారాయుడి పవిత్రోత్సవాలు ప్రారంభం
విశేష అలంకరణలో స్వామివారు

మోపిదేవి, జూలై 27: సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పవిత్రోత్సవ సహిత ఆషాఢ కృత్తికా మహోత్సవాలు శని వారం వైభవంగా ప్రారంభ మయ్యాయి. ఉదయం ఆలయ ఈవో ఎన్‌.ఎస్‌.చక్ర ధరరావు, అర్చక బృందం గోపూజ చేసి మహోత్సవా లను ప్రారంభించారు. ప్రధాన అర్చకుడు బుద్దు పవన్‌ కుమార్‌ శర్మ, వేద పండితుడు కొమ్మూరి ఫణి కుమార్‌ శర్మ ఆధ్వర్యంలో సుప్రభాతసేవ, అభిషేక జలసంగ్రహణం, ఆలయ ప్రదక్షిణ, విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం, రుత్విగ్వరణ, పంచగవ్యప్రాసన, అఖండ స్థాపన, వాస్తు మండపారాధన, సుబ్రహ్మణ్య మూలమంత్ర అనుష్టానసములను రుత్వికుల బృందం శాస్త్రోక్తంగా జరిపింది.

Updated Date - Jul 28 , 2024 | 12:56 AM