Share News

నవభారత నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములవ్వాలి

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:38 AM

దైనందిన ధర్మప్రవర్తనతో విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు అన్నారు.

నవభారత నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములవ్వాలి
గరికపాటికి పుష్పగుచ్ఛం ఇస్తున్న కమిటీ ప్రతినిధి, డాక్టర్‌ రమాదేవి

నవభారత నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములవ్వాలి

ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు

వన్‌టౌన్‌, మార్చి 11: దైనందిన ధర్మప్రవర్తనతో విద్యార్థులు తమ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాలని ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు అన్నారు. నవభారత నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. పొట్టి శ్రీరాములు చలువాది మల్లిఖార్జునరావు ఇంజనీరింగ్‌ కాలేజీలో సోమవారం సైన్స్‌, మానవ వనరుల విభాగం ఆధ్వర్యంలో నవభారత నిర్మాణం-ఇంజనీరింగ్‌ విద్యార్థులు అనే అంశంపై జరిగిన సెమినార్‌కు ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల కళ్లల్లో కన్నీరు రాకముందే వారి ప్రేమను, కష్టాన్ని అర్థం చేసుకుని వారి ఉద్దేశాలను నెరవేర్చేలా యువత లక్ష్యాలు ఉండాలన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని అన్నారు. కంప్యూటర్‌లు, సెల్‌ఫోన్‌లు, ట్యాబ్‌లు, ఎలకా్ట్రనిక్‌ పరికరాలు జ్ఞానసంపదకు మాత్రమే వినియోగించాలన్నారు. పని పట్ల నిరంతర శ్రద్ధ, నిరంతర కృషి ఉంటేనే విజయాలు సొంతమవుతాయని చెప్పారు. కళాశాల కార్యదర్శి పి.లక్ష్మణస్వామి, ప్రిన్సిపిల్‌ డాక్టర్‌ జే.లక్ష్మినారాయణ, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఏ.పతంజలి శాస్త్రి, కమిటీ సభ్యులు హరగోపాల్‌, డాక్టర్‌ మణికంఠ, సైన్స్‌, హ్యుమానిటీస్‌ విభాగాధిపతి డాక్టర్‌ ఏ.రమాదేవి, వివిధ విభాగాల విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 12:38 AM