Share News

సోషల్‌ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కఠిన చర్యలు

ABN , Publish Date - May 25 , 2024 | 12:38 AM

ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో వివాదాస్పద, అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని, రాజ కీయపార్టీ నాయకులు, కార్యకర్తలను కించపరిచే కామెంట్లు పెట్టడం, అసభ్య పదజాలంతో దూషిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, సందేశాలు పంపడం చేస్తే కఠిన చర్యలు తప్పవని గన్నవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య హెచ్చరించారు.

సోషల్‌ మీడియాలో వివాదాస్పద  పోస్టులు పెడితే కఠిన చర్యలు
గన్నవరం పోలీస్‌స్టేషన్‌లో సోషల్‌మీడియా నిర్వాహకులకు సూచనలు చేస్తున్న డీఎస్పీ జయసూర్య

గన్నవరం, మే 24: ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేవరకు ఎన్నికల కోడ్‌కు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో వివాదాస్పద, అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని, రాజ కీయపార్టీ నాయకులు, కార్యకర్తలను కించపరిచే కామెంట్లు పెట్టడం, అసభ్య పదజాలంతో దూషిస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, సందేశాలు పంపడం చేస్తే కఠిన చర్యలు తప్పవని గన్నవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మీ ఆదేశాల మేరకు శుక్రవారం గన్నవరం పోలీస్‌ స్టేషన్‌లో మండలంలోని వివిధ రాజకీయపార్టీలకు చెందిన సోషల్‌ మీడియా నిర్వా హకులతో ఆయన సమావేశం నిర్వహించారు. సామాజిక మాఽధ్యమాలద్వారా ప్రత్యర్థి నాయకులపై వ్యక్తిగత దూషణలతో విరుచుకుపడటం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం తగదని ఆయన హితవు పలికారు. ఎన్నికల ఫలితాలు తేలేంతవరకు సోషల్‌మీడియా నిర్వాహకులు సంయమనం పాటిస్తూ పోలీసులకు సహకరించాల న్నారు. సూచనలు పాటించని సోషల్‌మీడియా అడ్మిన్లు, యూజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సీఐ కేవీఎస్‌వీ ప్రసాద్‌, ఎస్సైలు శివప్రసాద్‌, కనకదుర్గ, టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీకి చెందిన సోషల్‌మీడియా నిర్వాహకులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:38 AM