విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:24 AM
శానిటరీ ఇన్‌స్పెక్టర్లు విఽఽధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ హెచ్చరించారు.
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్
చిట్టినగర్, ఫిబ్రవరి 5: శానిటరీ ఇన్‌స్పెక్టర్లు విఽఽధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ హెచ్చరించారు. సోమవారం నగరపాలక సంస్థ నూతన భవనంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లతో సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ల సమస్యలను నగర కమిషనర్ అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరాన్ని పరి శుభ్రంగా ఉంచడంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కీలకమని చెప్పారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఎటువంటి సహాయ సహకారం కావాలన్నా అందిస్తామన్నారు. అవసరమైతే పూడికలు తీయడానికి డివిజన్‌కు రెండు ట్రాక్టర్‌లు, పుష్‌కార్ట్‌లు సమకూరుస్తామన్నారు. మరీ అవసరమైతే కార్మికుల సంఖ్యను పెంచి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలన్నారు.