Share News

మద్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం

ABN , Publish Date - Mar 11 , 2024 | 12:54 AM

2019 ఎన్నికల ప్రచారంలో మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్‌ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ ధ్వజమెత్తారు.

మద్యాంధ్రప్రదేశ్‌గా రాష్ట్రం
14వ డివిజన్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గద్దె అనురాధ, రాజేష్‌, క్రాంతికుమార్‌

మద్య నిషేధం హామీ తుంగలో తొక్కిన జగన్‌: గద్దె అనురాధ

పటమట, మార్చి 10: 2019 ఎన్నికల ప్రచారంలో మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్‌ అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేశారని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ ధ్వజమెత్తారు. మద్య నిషేధం హామీని తుంగలోకి తొక్కి, కల్తీ మద్యాన్ని సీఎం జగన్‌రెడ్డి ఏరులై పారిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు. 14వ డివిజన్‌ పుట్టరోడ్‌ వాణినగర్‌ ప్రాంతంలో ఆదివారం ఎన్నికల ప్రచారంలో గద్దె రాజేష్‌, గద్దె క్రాంతికుమార్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. ప్రజలను కలుసుకుని ఓట్లను అభ్యర్థిం చారు. ప్రజలను అనేక రకాలుగా మోసం చేస్తున్న జగన్‌ను గద్దె దించాలన్నారు. నర్రా కిషోర్‌, బద్రి, కె.రమేష్‌, వడ్లపల్లి శివ, వీరంకి డాంగేకుమారి, చెరుకూరి సాంబయ్య, అన్నా బత్తుని బాబీ, శ్రీదేవి, యల్లబాబు పాల్గొన్నారు. గద్దె రామ్మోహన్‌ విజయాన్ని కాంక్షిస్తూ 12వ డివిజన్‌లో ఇంటింటికీ వెళ్లి గద్దె అనురాధ ప్రచారం నిర్వహించారు.

వైసీపీ ఓటమి ఖాయం: గద్దె అనురాధ

రామలింగేశ్వరనగర్‌: రాబోయే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ గద్దె అనురాధ అన్నారు. 15వ డివిజన్‌ రామలింగేశ్వరనగర్‌లో అదివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన తూర్పు అభ్యర్థి గద్దె రామ్మోహన్‌ను గెలిపించాలని కోరారు. గాదిరెడ్డి అమ్ములు, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 11 , 2024 | 12:54 AM