Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

నడిరోడ్డుపై వేదిక... ఆపేది ఎవరిక!

ABN , Publish Date - Mar 04 , 2024 | 01:29 AM

ప్రతిపక్షాలు చిన్న ర్యాలీ చేసినా ఆ పోలీసులు సహించరు. పదిమంది గుమిగూడితే గుడ్లు ఉరిమి చూస్తారు. ఏదో ఒక సాకుతో అరెస్టు చేస్తారు. అడ్డం చెబితే చావ బాదేస్తారు. అంతటితో ఆగకుండా క్రూరమైన కేసులు పెట్టేస్తారు.

నడిరోడ్డుపై వేదిక... ఆపేది ఎవరిక!

వైసీపీ నేతల ఇష్టారాజ్యం

పోలీసుల సహకారం

గుడివాడ: ప్రతిపక్షాలు చిన్న ర్యాలీ చేసినా ఆ పోలీసులు సహించరు. పదిమంది గుమిగూడితే గుడ్లు ఉరిమి చూస్తారు. ఏదో ఒక సాకుతో అరెస్టు చేస్తారు. అడ్డం చెబితే చావ బాదేస్తారు. అంతటితో ఆగకుండా క్రూరమైన కేసులు పెట్టేస్తారు. అదే అధికార పార్టీ ఏం చేసినా చట్టం గుర్తు రాదు. సెక్షన్లు తెలియవు. పైగా వారి కార్యక్రమం దగ్గరుండి మరీ పూర్తి చేయిస్తారు. పట్టణంలో ఆదివారం ఇదే జరిగింది. స్థానిక ముబారక్‌ సెంటర్‌లో వైసీపీ పట్టణ విభాగం ఆధ్వర్యాన ఎమ్మెల్యే కొడాలి నాని సమక్షంలో వైసీపీలో చేరికల కార్యక్రమం జరిగింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం ముబారక్‌ సెంటర్‌. దీని చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు ఈ రహదారి ప్రధానమైనది. ఆ పార్టీ నేతలు నడిరోడ్డుపై వేదికను ఏర్పాటు చేసి రహదారిని పూర్తిగా మూసివేశారు. మున్సిపల్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. పోలీసులైతే వేదిక ఏర్పాటుకు ఎటువంటి ఆటంకం కలుగకుండా దగ్గరుండి కాపలాగాసి తమ స్వామిభక్తి చాటుకున్నారు. ట్రాఫిక్‌ను మళ్లించే పనిలో నిమగ్నమయ్యే ట్రాఫిక్‌ పోలీసులు వైసీపీ సేవలో తరించారు. అదే ప్రతిపక్షలు ఏదైనా చిన్న కార్యక్రమం చేయాలన్నా అనుమతులు తప్పనిసరి. అన్ని అనుమతులూ ఉన్నా ఏదో ఒకటి గుర్తుకు వచ్చి నిలుపుదల చేసేందుకు పోలీసులు అత్యుత్సాహం చూపుతారు.

Updated Date - Mar 04 , 2024 | 01:29 AM