Share News

ధనుర్మాసంలో వైష్ణవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

ABN , Publish Date - Nov 28 , 2024 | 01:05 AM

ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 13, 14, 20, 21, 27, 28 తేదీల్లో మచిలీపట్నం డిపో నుంచి సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ పెద్దిరాజు తెలిపారు.

ధనుర్మాసంలో వైష్ణవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

మచిలీపట్నం టౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 13, 14, 20, 21, 27, 28 తేదీల్లో మచిలీపట్నం డిపో నుంచి సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్‌ పెద్దిరాజు తెలిపారు. అప్పనపల్లి బాలబాలాజీ, అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి, గొల్లలమామిడాడ కోదండరామస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయాలను సందర్శించేందుకు రాత్రి 11.30 గంటలకు సూపర్‌ లగ్జరీ సర్వీసులు ఏర్పాటు చేస్తామన్నారు. రూ.1300 చెల్లించి అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ చేసుకోవచ్చన్నారు. వివరాలకు 88088 07789కు ఫోన్‌ చేయాలని ఆయన సూచించారు.

Updated Date - Nov 28 , 2024 | 01:05 AM