Share News

స్పందన అర్జ్జీలను పరిష్కరించండి

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:09 AM

స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డీపీవో నాగేశ్వరనాయక్‌, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

స్పందన అర్జ్జీలను పరిష్కరించండి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాజాబాబు

మచిలీపట్నం, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి) : స్పందనలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా సోమవారం జెడ్పీ సీఈవో జ్యోతిబసు, డీపీవో నాగేశ్వరనాయక్‌, ఇతర అధికారులతో కలిసి ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, స్పందనలో వచ్చిన అర్జీలను పెండింగ్‌ ఉంచకుండా, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. 118అర్జీలను వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖరరావు, మచిలీపట్నం ఆర్డీవో ఎం.వాణి, డీఎ్‌సవో పార్వతి, డీఈవో తాహెరా సుల్తానా వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇళ్లస్థలాల రిజిస్ర్టేషన్‌పై అధికారులతో సమీక్ష

ఉయ్యూరు డివిజన్‌లో ఇళ్లస్థలాల రిజిస్ర్టేషన్‌లను వేగవంతం చేయాలని కలెక్టర్‌ పి.రాజాబాబు అన్నారు. ఉయ్యూరు డివిజన్‌ అధికారులతో సోమవారం తనఛాంబరులో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. డివిజన్‌లో 79శాతం మేర ఇళ్లస్థలాల రిజిస్ట్రేషన్‌ పూర్తయిందని, మిగిలిన రిజిస్ర్టేషన్లు వెంటనే పూర్తిచేయాలన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 01:09 AM