Share News

పదిలంగా.. రాయాలిక..

ABN , Publish Date - Mar 18 , 2024 | 01:15 AM

జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవు తాయి.

పదిలంగా.. రాయాలిక..

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

151 కేంద్రాలు.. 26507 మంది విద్యార్థులు

మచిలీపట్నం టౌన్‌, మార్చి 17 : జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవు తాయి. విద్యార్థులు పది నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రంలో ఉండాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ్ణజిల్లాలో 395 ఉన్నత పాఠశా లల్లో పదోతరగతి చదువుతున్న 26507 మంది విద్యార్థులు 151 కేంద్రాలలో పరీక్షలు రాయనున్నారు. 14455 మంది బాలురు, 12052 మంది బాలికలు పరీక్షలు రాస్తున్నారు. రెగ్యులర్‌ విద్యార్థులు 21458 మంది పరీక్షలు రాస్తుండగా, ప్రైవేటు విద్యార్థులు 5049 మంది రాస్తున్నారు. పరీక్షలకు 170 మంది దివ్యాంగులు హాజరవుతున్నారు. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేం దుకు పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖ అధికారులతో ఐదు ప్లయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. 151 కేంద్రాలకు డిపార్టుమెంట్‌ ఆఫీసర్లను నియమించారు.

లీక్‌ కాకుండా చర్యలు తీసుకున్నాం

టెన్త్‌ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. ఇన్విజిలేటర్లు ఎవరూ పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోన్లు తీసుకెళ్లకూడదు. ప్రశ్నాపత్రాలు లీక్‌ కాకుండా చర్యలు తీసుకున్నాం, లీక్‌ అయితే క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలిసిపోతుంది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందు వచ్చి తమకు కేటాయించిన గదిని చూసుకోవాలి.

- తాహెరా సుల్తానా, డీఈవో

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : జిల్లాలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈనెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్షలు ప్రారంభమవుతాయి. విద్యార్థులు పది నిమిషాలు ముందుగానే పరీక్షా కేంద్రంలో ఉండాలని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 450 పాఠశాలల నుంచి విద్యార్థులు ఈ పరీక్షలు రాయబోతున్నారు. బాలురు 17,414 మంది, బాలికలు 15,593 మంది పరీక్షలకు హాజరుకాబోతున్నారు. పరీక్షల నిర్వహణకు అధికారులు మొత్తం 178 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పదో పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ఓపెన్‌ స్కూల్‌లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఓపెన్‌ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థుల కోసం పది, ఇంటర్మీడియట్‌ విద్యార్థుల కోసం 18 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పదో తరగతి పరీక్షలకు 1785, ఇంటర్‌ పరీక్షలకు 3710 మంది విద్యార్థులు హాజరుకాబతోతున్నారు. ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో ఎలాంటి మాల్‌ప్రాక్టీస్‌ లేకుండా చేయడానికి ఐదు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌లు, ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలకు రెండు ప్లైయింగ్‌ స్క్వాడ్‌లు ఏర్పాటు చేవారు. రెండు పరీక్షలకు కలిపి మొత్తం 14 మంది రూట్‌ ఆఫీసర్లను నియమించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎలాంటి ఎలకా్ట్రనిక్‌ వస్తువులు తీసుకురావద్దని అధికారులు ఆదేశించారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Mar 18 , 2024 | 01:15 AM