Share News

సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలి

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:26 AM

చదువుతో పాటు విద్యార్థులు సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలని దుర్గగుడి ఈవో కేఎస్‌ రామారావు హితవు పలికారు.

సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలి
విద్యార్థినుల సాంస్కృతిక కార్యక్రమాలు

సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలి

విద్యార్థులకు దుర్గగుడి ఈవో రామారావు హితవు

వన్‌టౌన్‌, మార్చి 27: చదువుతో పాటు విద్యార్థులు సామాజిక చైతన్యాన్ని పెంపొందించుకోవాలని దుర్గగుడి ఈవో కేఎస్‌ రామారావు హితవు పలికారు. కేబీఎన్‌ కళాశాలలో బుధవారం జరిగిన స్పోర్ట్స్‌ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జ్యోతి వెలిగించి కార్యక్రమాలను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ సమాజాన్ని విద్యార్థులు అవగతం చేసుకోవాలన్నారు. బాధ్యతా యుతంగా జీవితాన్ని సాగించాలన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము తీర్చిది ద్దుకోవాలని పేర్కొన్నారు. 59 ఏళ్లు విద్యా సేవలందిస్తున్న కళాశాల పాలకవర్గాన్ని అభినందించారు. గుంటూరు టీజేపీఎస్‌ కళాశాల కార్యదర్శి కేవీ బ్రహ్మం మాట్లాడుతూ కళాశాల విద్యారంగంలో చక్కని సేవలందిస్తోందని చెప్పారు. కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు టి.శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కాలనుగుణంగా వస్తున్న మార్పులను ఆకళింపు చేసుకుని విద్యార్థులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వి.నారాయణరావు సమర్పించిన నివేదికలలో గతేడాది సాధించిన విజయాలను పేర్కొన్నారు. సహాయ కార్యదర్శి జీవీ రామారావు, కోశాధికారి అన్నం రామకృష్ణారావు, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ ఎం.వెంకటేశ్వరరావు, పీఎల్‌ రమేష్‌, డాక్టర్‌ కే.రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

Updated Date - Mar 28 , 2024 | 12:26 AM