శోభాయమానం.. ఆకాశదీపం
ABN , Publish Date - Nov 03 , 2024 | 12:48 AM
కార్తీకమాస ప్రారంభ సందర్భంగా శివాలయాల్లో శనివారం శోభాయమానంగా ఆకాశదీపం వెలిగించారు. కార్తీకమాస సంద ర్భంగా శివాలయాల్లో ప్రతి ఏటా సంప్రదాయ బద్ధంగా ఆకాశ దీపాన్ని వెలిగించడం అనవాయితీ. పెరికీడులోని ముక్తేశ్వరాల యంలో అర్చకులు కుందుర్తి శ్యామ్, సీతారామయ్య ప్రత్యేక పూజ లనంతరం ధ్వజ స్తంభం వద్ద ఆకాశదీపాన్ని వెలిగించారు.
హనుమాన్‌జంక్షన్‌రూరల్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి) : కార్తీకమాస ప్రారంభ సందర్భంగా శివాలయాల్లో శనివారం శోభాయమానంగా ఆకాశదీపం వెలిగించారు. కార్తీకమాస సంద ర్భంగా శివాలయాల్లో ప్రతి ఏటా సంప్రదాయ బద్ధంగా ఆకాశ దీపాన్ని వెలిగించడం అనవాయితీ. పెరికీడులోని ముక్తేశ్వరాల యంలో అర్చకులు కుందుర్తి శ్యామ్, సీతారామయ్య ప్రత్యేక పూజ లనంతరం ధ్వజ స్తంభం వద్ద ఆకాశదీపాన్ని వెలిగించారు. నం డూరి శర్మ, కొల్లిమర్ల రంగారావు, నక్కా బాబు, తదితరులు పాల్గొన్నారు. కానుమోలులోని శివాలయంలో అర్చకుడు పవన్‌శర్మ ఆధ్వర్యంలో ఆకాశదీపాన్ని వెలిగించారు. వీరవల్లి కొండేశ్వరస్వామి దేవాలయంలో అర్చకుడు మురళీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకాశదీపాన్ని వెలిగించారు. ఆకాశదీపాన్ని సందర్శిం చేందుకు వచ్చిన భక్తుల శివనామస్మరణతో శివాలయాలు మార్మోగాయి.
వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో..
హనుమాన్‌జంక్షన్ : కార్తీకమాసం ప్రారంభం సందర్భంగా శనివారం స్థానిక నూజివీడు రోడ్డులోని లక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు ప్రారంభించారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ట్రస్టి కాకాని బాబు, తవ్వా పూర్ణచంద్రరావు, ఈవో శ్రీనివాస్ పర్యవేక్షణలో అర్చకులు చక్రావధానుల సీతారామాచార్యులు ఆలయధ్వజ స్తంభం వద్ద ఆకాశ దీప ప్రజ్వలనతో కార్తీక మాస పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. పలువురు భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.