Share News

డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యం పెంచుకోవాలి

ABN , Publish Date - Jul 31 , 2024 | 12:09 AM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిట్‌ డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీలలో నిపుణుల అవసరం ఉందని నాస్కామ్‌ ఢిల్లీ మేనేజర్‌ ఉత్తమ్‌ కుమార్‌ అన్నారు.

డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యం పెంచుకోవాలి

డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యం పెంచుకోవాలి

నాస్కామ్‌ ఢిల్లీ మేనేజర్‌ ఉత్తమ్‌ కుమార్‌

లబ్బీపేట, జూలై 30: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిట్‌ డేటా అనలిటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీలలో నిపుణుల అవసరం ఉందని నాస్కామ్‌ ఢిల్లీ మేనేజర్‌ ఉత్తమ్‌ కుమార్‌ అన్నారు. నలంద కళాశాలలో మంగళవారం ఆర్టిఫిషియల్‌ అసెండ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా నాస్కామ్‌, యాక్సెంచర్‌ ఆధ్వర్యంలో సెమినార్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఈ అంశాల్లో నైపుణ్యాలు ఎలా పెంపొందించుకోవాలో, నాస్కామ్‌ అందించే కోర్సులను సెల్ఫ్‌ ఫేస్‌డ్‌ లెర్నింగ్‌ ద్వారా నేర్చుకోవాలని తెలిపారు. డేటా సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ భవిష్యత్తులో ఎలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయో అందుకు విద్యార్థులు ఎలా సన్నిద్ధం కావాలో ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.అనురాధ మాట్లాడుతూ నాస్కామ్‌తో ఎంఓయు చేసుకుని యాక్సెంచర్‌ ద్వారా విద్యార్థులకు అందించే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అసెండ్‌ ప్రోగ్రామ్‌ ద్వారా వివిధ సర్టిఫికెట్స్‌ పొందటానికి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. నాస్కామ్‌ రీజనల్‌ హెడ్‌ బి.ప్రవీన్‌ కుమార్‌, కంప్యూటర్స్‌ సైన్స్‌ హెచ్‌వోడీ పి.భవాని, ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌ బి.చంద్రగిరి, బి.ప్రదీప, బీఎస్సీ, ఏఐ, కంప్యూటర్‌సెన్స్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 31 , 2024 | 12:09 AM