ప్రమాదాలకు ‘సిగ్నల్’
ABN , Publish Date - Oct 21 , 2024 | 01:27 AM
రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం లేదు.
రామవరప్పాడు రింగ్ రోడ్డులో ట్రాఫిక్ సిగ్నల్స్ లేక తరచూ ప్రమాదాలు
(ఆంధ్రజ్యోతి-గుణదల): నిత్యం రద్దీగా ఉండే రామవరప్పాడు రింగ్ రోడ్డు వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నా, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం లేదు. ప్రమాదాల కారణంగా ప్రతినెలా మరణాలు నమోదవుతున్నాయి. ప్రమాదాల జోన్‌లా మారిన ఈ సెంటర్‌లో విధులు నిర్వ హించే ట్రాఫిక్ కానిస్టేబుళ్లకూ వాహనాలను క్రమబద్ధీకరించడం చాలా కష్టంగా ఉంది. పోలీసు అధికారులు తక్షణమే ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వాహనచోదకులు కోరుతున్నారు.