Share News

ష్‌.. గప్‌చుప్‌..!

ABN , Publish Date - Mar 26 , 2024 | 12:56 AM

నాలుగు నెలల కిందట.. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు స్టేషన్‌కు వచ్చి తన ఇంట్లో రూ.12 లక్షలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశాడు. ఆ సొమ్మును రికవరీ చేసిన పోలీసులు బాధితుడి వద్ద నుంచి రూ.80 వేల వరకూ వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. నెల కిందట ఇదే స్టేషన్‌ పరిధిలోని ఓ బార్‌లో మందుబాబులు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి, స్టేషన్‌ బెయిల్‌ నిమిత్తం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 వేలు దండుకున్నట్లు తెలిసింది. న్యూఆర్‌ఆర్‌ పేట అరుణోదయ నగర్‌లో గత నెలలో ద్విచక్ర వాహనం దొంగతనం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరికి న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. మిగిలిన ఇద్దరికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.30 వేలు చేతులు తడిపినట్లు సమాచారం. పేరుకే ఫ్రెండ్లీ పోలీస్‌.. కానీ, అక్కడ కాసులున్నోడు, ప్రభుత్వ పెద్దల అండ ఉన్నోడితోనే ఫ్రెండ్షిప్‌ చేస్తారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలనే రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ.. ఖద్దర్‌ నాయకులకు ఇక్కడి ఖాకీలు దాసోహమంటారు. న్యాయం కోసం స్టేషన్‌ గడప తొక్కే సామాన్యుడికి ఆశించిన సహాయాన్ని మాత్రం అందించని అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ష్‌.. గప్‌చుప్‌..!

అజిత్‌సింగ్‌నగర్‌ పీఎస్‌ రూటే సెపరేటు

నేరాలు దాచేందుకు పోలీసుల ఆపసోపాలు

అర్ధరాత్రి దాటాకే కేసుల నమోదు

మీడియాకు, ప్రజలకు తెలియకుండా గోప్యత

స్టేషన్‌ ఆవరణలో జోరుగా సివిల్‌ పంచాయితీలు

పాత కేసుల విచారణకు పాతర

స్టేషన్‌ బెయిల్‌ కోసం రూ.వేలల్లో వసూలు

నాలుగు నెలల కిందట.. అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. బాధితుడు స్టేషన్‌కు వచ్చి తన ఇంట్లో రూ.12 లక్షలు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశాడు. ఆ సొమ్మును రికవరీ చేసిన పోలీసులు బాధితుడి వద్ద నుంచి రూ.80 వేల వరకూ వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి.

నెల కిందట ఇదే స్టేషన్‌ పరిధిలోని ఓ బార్‌లో మందుబాబులు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో ఓ యువకుడు తీవ్రగాయాలపాలయ్యాడు. ఈ ఘటనలో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి, స్టేషన్‌ బెయిల్‌ నిమిత్తం ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.10 వేలు దండుకున్నట్లు తెలిసింది.

న్యూఆర్‌ఆర్‌ పేట అరుణోదయ నగర్‌లో గత నెలలో ద్విచక్ర వాహనం దొంగతనం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఒకరికి న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. మిగిలిన ఇద్దరికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.30 వేలు చేతులు తడిపినట్లు సమాచారం.

పేరుకే ఫ్రెండ్లీ పోలీస్‌.. కానీ, అక్కడ కాసులున్నోడు, ప్రభుత్వ పెద్దల అండ ఉన్నోడితోనే ఫ్రెండ్షిప్‌ చేస్తారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించాలనే రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ.. ఖద్దర్‌ నాయకులకు ఇక్కడి ఖాకీలు దాసోహమంటారు. న్యాయం కోసం స్టేషన్‌ గడప తొక్కే సామాన్యుడికి ఆశించిన సహాయాన్ని మాత్రం అందించని అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పనితీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అజిత్‌సింగ్‌నగర్‌ : అజిత్‌సింగ్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ రూటే సెపరేటు. వైసీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న నేరాలను మీడియాకు, ప్రజలకు తెలియకుండా గోప్యంగా ఉంచేందుకు ఇక్కడ చట్టాలను తుంగలో తొక్కుతారు. ఈ స్టేషన్‌లో కొంతమంది అధికారులు, సిబ్బంది అవినీతికి ఆజ్యం పోస్తూ ప్రవర్తిస్తుంటారు. ముందు రోజు జరిగిన సంఘటన అయినా, ఉదయం జరిగిన నేరమైనా, చోరీలైనా, మిస్సింగ్‌ కేసులైనా, చివరకు ప్రతిపక్ష నాయకులపై నమోదు చేసే అక్రమ కేసులైనా అర్థరాత్రి సమయాల్లో చేపడతారు. ఫలితంగా తమ ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలు మీడియా ద్వారా ప్రజలకు చేరనీయకుండా చేస్తున్నారు.

మామూళ్లపైనే శ్రద్ధ

స్టేషన్‌ అధికారులకు మామూళ్లపై ఉన్న శ్రద్ధ నేరాల నియంత్రణపై ఉండట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా గంజాయి, బ్లేడ్‌బ్యాచ్‌ అధికంగా ఉండే న్యూఆర్‌ఆర్‌పేట, సింగ్‌నగర్‌ లూనా సెంటర్‌, చెత్త డంపింగ్‌ యార్డ్‌, రైల్వేట్రాక్‌ ప్రాంతాలపై నిఘా కొరవడిందని, వీరి ఆగడాలు రోజురోజుకూ పేట్రేగిపోతున్నాయంటూ స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న కొత్త అపార్ట్‌మెంట్ల ప్రాంతంలో అల్లర్లు అధికంగా జరుగుతున్నాయని, ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా వారిని అదుపు చేయడం లేదంటున్నారు. స్టేషన్‌ పరిధిలో ఎవరి స్థాయికి తగ్గట్టు వారు జేబులు నింపుకోవడంపైనే అధిక దృష్టి సారిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మద్యం దుకాణాలపై నిఘా కొరవడింది. సమయం దాటినా కూడా బార్లలో మందు అమ్మకాలు జరుపుతుండటంతో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి. పోలీసుల బీట్ల పేరుతో సిబ్బంది కూడా రోడ్డుపై తోపుడుబళ్లు, చిరు వ్యాపారుల వద్ద డబ్బులు దండుకునే పనులపైనే శ్రద్ధ చూపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

అటు స్వామిభక్తి.. ఇటు కాసుల కక్కుర్తి..

స్టేషన్‌ పరిధిలో జరుగుతున్న నేరాల బురదను ప్రభుత్వంపై పడకుండా చూస్తున్నామని చెప్పుకొంటూ కొంతమంది అధికారులు స్వామిభక్తిని చాటుకుంటున్నారు. న్యాయం కోసం వచ్చిన వారిని ఒకటి రెండు రోజుల వరకూ తిప్పి కాసుల కోసం రాజీలు పడేలా చేయడం, అది కాకపోతే అర్థరాత్రులు కేసులు నమోదు చేసి బెయిల్‌ నిమిత్తం 41 సీఆర్‌పీసీ నోటీసులతో దండుకోవడం చేస్తున్నారు.

నిద్దరోతున్న నిఘా

స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందా లేదా, పోలీసుల విధి నిర్వహణలో ఏమైనా లోపాలు ఉంటున్నాయా, చట్టానికి లోబడే సిబ్బంది నడుచుకుంటున్నారా లేదా, లంచాలు ఏమైనా తీసుకుంటున్నారా అనే అంశాలను గమనిస్తూ ఉన్నతాధికారులకు సమాచారం అందించేందుకు ప్రతి స్టేషన్‌కు ఓ నిఘా వర్గం ఉంటుంది. ఈ స్టేషన్‌కు కూడా నిఘా వర్గం ఉన్నప్పటికీ పోలీసులు ఏమాత్రం జంకు లేకుండా తమ పనులు చేసుకుంటున్నారు. వసూళ్లలో కొంత ‘స్పెషల్‌’కు కూడా వెళ్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - Mar 26 , 2024 | 12:56 AM