Share News

డిస్నీల్యాండ్‌ స్థలంలో కబేళా ఏర్పాటు అమానుషం

ABN , Publish Date - Mar 01 , 2024 | 12:39 AM

పేద, బడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా నివసిస్తున్న అజిత్‌సింగ్‌నగర్‌ డిస్నీల్యాండ్‌ స్థలంలో కబేళా ఏర్పాటుకు నగరపాలక సంస్థ తీర్మానం చేయటం అమానుషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు.

డిస్నీల్యాండ్‌ స్థలంలో కబేళా ఏర్పాటు అమానుషం
మాట్లాడుతున్న బాబూరావు

డిస్నీల్యాండ్‌ స్థలంలో కబేళా ఏర్పాటు అమానుషం

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు

సీహెచ్‌ బాబూరావు

అజిత్‌సింగ్‌నగర్‌, ఫిబ్రవరి 29 : పేద, బడుగు, బలహీన వర్గాలు ఎక్కువగా నివసిస్తున్న అజిత్‌సింగ్‌నగర్‌ డిస్నీల్యాండ్‌ స్థలంలో కబేళా ఏర్పాటుకు నగరపాలక సంస్థ తీర్మానం చేయటం అమానుషమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు విమర్శించారు. వాంబేకాలనీ డిస్నీల్యాండ్‌ స్థలంలో కబేళా ఏర్పాటును విరమించుకుని సదరు స్థలాన్ని పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ సీపీఎం, సీపీఐల ఆధ్వర్యంలో గురువారం డిస్నీల్యాండ్‌ వద్ద నిరసన జరిగింది. ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ డిస్నీల్యాండ్‌ లీజు పరిమితి పూర్తయి 57 ఎకరాల స్ధలాన్ని నగరపాలక సంస్ధ స్వాధీనం చేసుకుందని తెలిపారు. సదరు స్ధలంలో కబేళా ఏర్పాటు చేయడం వలన ఈ ప్రాంతం తీవ్ర దుర్గందం వెదజల్లుతూ ప్రజలు ఆరోగ్యానికి ముప్పు వాటిల్లో ప్రమాదం ఉందని తెలిపారు. జగన్‌ ప్రభుత్వం పేదలను పొమ్మనకుండా పొగబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు డిస్నీల్యాండ్‌ స్థలంలో కబేళా ఏర్పాటుకు చర్యలు విరమించుకోవాలని, సదరు స్థలాన్ని పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించి తక్షణమే రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్‌ చేశారు. నేతలు కాశీనాథ్‌, కేవీ భాస్కరరావు, రమణారావు, కె.దుర్గారావు పాల్గొన్నారు.

Updated Date - Mar 01 , 2024 | 12:39 AM