Share News

ముగిసిన నామినేషన్ల స్ర్కూటినీ

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:51 AM

ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్ర్కూటినీలో భాగంగా విజయవాడ పార్లమెంట్‌, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలకు సంబంధించి 125 నామినేషన్లు ఆమోదం పొందగా.. 85 నామినేషన్లు తిరస్కణకు గురయ్యాయి.

ముగిసిన నామినేషన్ల స్ర్కూటినీ

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఎన్టీఆర్‌ జిల్లా వ్యాప్తంగా నామినేషన్ల స్ర్కూటినీలో భాగంగా విజయవాడ పార్లమెంట్‌, తిరువూరు, జగ్గయ్యపేట, మైలవరం, నందిగామ, విజయవాడ తూర్పు, పశ్చిమ, సెంట్రల్‌ నియోజకవర్గాలకు సంబంధించి 125 నామినేషన్లు ఆమోదం పొందగా.. 85 నామినేషన్లు తిరస్కణకు గురయ్యాయి. మొత్తం 332 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకే అభ్యర్థి నాలుగు సెట్ల వరకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ క్రమంలో 122 సెట్ల నామినేషన్లు అదనంగా వచ్చాయి.

ఫ తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 13 ఆమోదం పొందగా 5 తిరస్కరణకు గురయ్యాయి. విజయవాడ పశ్చిమలో 17 నామినేషన్లు ఆమోదం పొందగా 21 తిరస్కరణకు గురయ్యాయి. జగ్గయ్యపేటలో 14 నామినేషన్లు ఆమోదం పొందగా 9 తిరస్కరణకు గురయ్యాయి. మైలవరంలో 12 ఆమోదం పొందగా, 15 తిరస్కరణకు గురయ్యాయి. నందిగామలో 11 నామినేషన్లు ఆమోదం పొందగా 6 తిరస్కరణకు గురయ్యాయి. విజయవాడ తూర్పులో 17 ఆమోదం పొందగా 10 తిరస్కరణకు గురయ్యాయి. విజయవాడ సెంట్రల్‌లో 22 ఆమోదం, 4 తిరస్కరణకు గురయ్యాయి.

ఫ విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియను జిల్లా కలెక్టరేట్‌లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు మంజూ రాజ్‌పాల్‌ , నరేంద్ర సింగ్‌ బాలిలు పరిశీలించారు. అసిస్టెంట్‌ కలెక్టర్‌ శుభం నోఖ్వాల్‌, రాజకీయ పార్టీల ప్రతినిథులు, అభ్యర్థులు కూడా పాల్గొన్నారు.

ఫ విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో మొత్తం 50 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వాటిలో 19 మంది నామినేషన్లు మాత్రమే చెల్లుబాటు అయ్యాయి. మరో 15 వివిధ కారణాలతో తిరస్కరించారు. టీడీపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్‌ సతీమణి కేశినేని జానకీ లక్ష్మి, వైసీపీ అభ్యర్థి కేశినేని శ్రీనివాస్‌ తనయ కేశినేని శ్వేతా చౌదరిల నామినేషన్లను తిరస్కరించారు.

ఫ తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 28 నామినేషన్లకు గాను 13 నామినేషన్ల ఆమోదమయ్యాయి. ఐదు నామినేషన్లను తిరస్కరించారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల సతీమణులు నామినేషన్లు తిరస్కరించటం జరిగింది.

ఫ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యధికంగా 61 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 17 నామినేషన్లు ఆమోదం పొందాయి. షేక్‌ ఆసిఫ్‌ - వైసీపీ, వై సుజనా చౌదరి - బీజేపీ, మద్దిరాల వినోద్‌కుమార్‌ - బీఎ్‌సపీ లతో పాటు గుర్తింపు పొందిన పార్టీలు, స్వతం త్రులకు సంబంధించి మరో 14 నామినేషన్లు ఆమోదమయ్యాయి.

ఫ జగ్గయ్యపేట నియోజకవర్గంలో మొత్తం 39 సెట్ల నామినేషన్లకు గాను 14 నామినేషన్లు ఆమోదమయ్యాయి. శ్రీరాం రాజగోపాల్‌-టీడీపీ, సామినేని ఉదయభాను-వైసీపీ, కర్నాటి అప్పారావు-కాంగ్రెస్‌, కొదమల ప్రభుదాస్‌-బీఎ్‌సపీల అభ్యర్థుల నామినేషన్లతో పాటు రిజిస్టర్డ్‌ పార్టీలు, స్వతంత్రులకు సంబంధించి మరో 6 ఆమోదమయ్యాయి.

ఫ మైలవరం నియోజకవర్గంలో మొత్తం 39 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 12 నామినేషన్లు ఆమోదం పొందాయి. వసంత క్రిష్ణ ప్రసాద్‌- టీడీపీ, సర్నాల తిరుపతిరావు-వైసీపీ, బొర్రా కిరణ్‌-కాంగ్రెస్‌, జి.వెంకటే శ్వరరావు-బీఎ్‌సపీలులతో పాటు గుర్తింపు పొందిన పార్టీలు, స్వతంత్రులకు సంబంధించి 10 నామినేషన్లు ఆమోదమయ్యాయి.

ఫ నందిగామ నియోజకవర్గంలో మొత్తం 24 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 11 నామినేషన్లు ఆమోదమయ్యాయి. 6 నామినేషన్లు తిరస్కరణ అయ్యాయి. తంగిరాల సౌమ్య-టీడీపీ, బర్రె ఉదయకిరణ్‌-బీఎ్‌సపీ, మొండితోక జగన్మోహనరావు- వైసీపీ, మందా వజ్రయ్య-కాంగ్రెస్‌ల నామినేషన్లు ఆమోదం కాగా మరో 7 నామినేషన్లు గుర్తింపు పార్టీ, స్వతంత్ర అభ్యర్థులవి ఆమోదమయ్యాయి.

ఫ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 43 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో మొత్తం 17 నామినేషన్లు ఆమోదం పొందాయి. పది తిరస్కరణకు గురయ్యాయి. దేవినేని అవినాశ్‌-వైసీపీ, కనపర్తి మురళి-బీఎ్‌సపీ, గద్దె రామమోహన్‌-టీడీపీ, పొనుగుపాటి నాంచారయ్య-కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు మరో 13 నామినేషన్లు ఆమోదమయ్యాయి.

ఫ విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో మొత్తం 48 సెట్ల నామినేషన్లు దాఖలు కాగా 22 నామినేషన్లు ఆమోదం పొందాయి. 4 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఐరాజేంద్ర ప్రసాద్‌- బీఎ్‌సపీ, చిగురుపాటి బాబూరావు-సీపీఎం, బోండా ఉమామహేశ్వరరావు-టీడీపీ, వెలంపల్లి శ్రీనివాసరావు-వైసీపీలతో పాటు మరో 18 గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి.

కృష్ణా జిల్లాలో 38 నామినేషన్ల తిరస్కరణ..

మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో మూడు నామినేషన్లు, అసెంబ్లీ స్థానాలకు 35 తిరస్కరణ

8 113మంది అభ్యర్థులకు సంబంధించి 151 నామినేషన్లు ఆమోదం

మచిలీపట్నం, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన కార్యక్రమం శుక్రవారం ముగిసింది. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి 28నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన అనంతరం 25మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించారు. ముగ్గురు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 35మంది అభ్యర్థుల నామినేషన్‌లను తిరస్కరించారు. 113మంది అభ్యర్థులకు సంబంధించి 151నామినేషన్లు సకమ్రంగా ఉండటంతో వాటిని ఆమోదించారు.

ఫ అవనిగడ్డ నియోజకవర్గంలో 13మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్‌లను ఆమోదించారు. స్వతంత్ర అభ్యర్థి మండలి వెంకట్రామ్‌, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అందె శ్రీవాణి, వైసీపీ అభ్యర్థి సింహాద్రి వికాస్‌ నామినేషన్‌లను తిరస్కరించారు. ఈ ముగ్గురు అభ్యర్థులకు 10మందికి ప్రతిపాదకుల సంతకాలు లేకపోవడంతో వీరి నామినేషన్‌లను తిరస్కరించినట్టు ఆర్వో తెలిపారు.

ఫ గుడివాడ నియోజకవర్గంలో 26నామినేషన్లు దాఖలు కాగా వాటిలో నామినేషన్ల పరిశీలన అనంతరం 17 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు రిటర్నింగ్‌ అఽధికారి పద్మావతి తెలిపారు. 9మంది అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్‌లను తిరస్కరించినట్టు ఆమె చెప్పారు. నామినేషన్లు తిరస్కరించబడిన అభ్యర్థులలో నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, టీడీపీ, వైసీపీ అభ్యర్థుల తరపున డమ్మీ నామినేషన్‌లు వేసిన ఇద్దరు, జైబీమ్‌ భారత్‌పార్టీ, జై మహా భారత్‌పార్టీ అభ్యర్థుల నామినేషన్‌లు తిరస్కరణకు గురయ్యాయి.

ఫ మచిలీపట్నం నియోజకవర్గంలో 14మంది అభ్యర్థులకు నామినేషన్‌లు సక్రమంగా ఉన్నట్టు రిటర్నింగ్‌ అధికారి ఎం.శ్రీవాణి తెలిపారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల తరపున డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్‌లు దాఖలు చేసిన కొల్లు నీలిమ, పేర్ని వెంకట్రామయ్య మరో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌లను తిరస్కరించారు.

ఫ పెడన నియోజకవర్గంలో 10 మంది అభ్యర్థుల నామినేషన్‌లు సక్రమంగా ఉన్నట్టు పెడన నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి పి.వెంకటరమణ తెలిపారు. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల తరపున డమ్మీఅభ్యర్థులుగా నామినేషన్‌లు దాఖలు చేసిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్‌లను తిరస్కరించారు..

ఫ పామర్రు నియోజకవర్గంలో ఎనిమిది మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉండటంతోవాటిని ఆమోదించారు. టీడీపీ, వైసీపీ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులకు డమ్మీ అభ్యర్థులుగా నామినేషన్‌లు దాఖలుచేసిన వర్లరామయ్య, కైలే జ్ఞానమణి, దోవారి అమర్నాధ్‌ నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు రిటర్నింగ్‌ అధికారి తెలిపారు.

ఫ పెనమలూరు నియోజకవర్గంలో 12మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉండటంతో ఆమోదించారు. వైసీపీ అభ్యర్థికి డమ్మీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన జోగి రాజీవ్‌, స్వతంత్ర అభ్యర్థి దొండపాటి సతీష్‌, జాతీయ జనసేనపార్టీ అభ్యర్థి జి.సీతారామయ్య, జై భారత్‌పార్టీ అభ్యర్థి కరుణాకరదాస్‌ నామినేషన్లను తిరస్కరించారు.

Updated Date - Apr 27 , 2024 | 12:51 AM