శాస్త్ర, సాంకేతిక అంశాలపై పట్టు సాధించాలి
ABN , Publish Date - Jun 27 , 2024 | 01:08 AM
నిరంతర అధ్యయనంతోపాటు విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలపై మంచి పట్టు సాధించాలని, నూతన ఆవిష్కరణలకు రూపకల్పనచేస్తూ గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో టి.అనిల్‌కుమార్ ఆకాంక్షించారు.

ఉంగుటూరు, జూన్ 26 : నిరంతర అధ్యయనంతోపాటు విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక అంశాలపై మంచి పట్టు సాధించాలని, నూతన ఆవిష్కరణలకు రూపకల్పనచేస్తూ గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ సీఈవో టి.అనిల్‌కుమార్ ఆకాంక్షించారు. ది ఇన్‌స్టిట్యూషన్ ఇన్నోవేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో తేలప్రోలు ఉషారామా ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన అనిల్‌కుమార్ ఇన్నోవేషన్ సొసైటీలో అవకాశాలు, ఆవిష్కరణలకు సంబంధించి స్టార్టప్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇన్నోవేటర్స్, స్కిల్ డెవలప్‌మెంట్‌పై అవగాహన కల్పించారు. పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రాముఖ్యత గురించి రాజమండ్రికి చెందిన బిజినెస్ట్ కన్సల్టెన్సీ అండ్ ట్రైనింగ్ ఎండీ కృష్ణసౌజన్య వివరించారు. పారిశ్రామికరంగంలో మెరుగ్గా రాణించాలనుకునే విద్యార్థులు ముందుగా చుట్టుపక్కల వున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పరిశీలించి, పారిశ్రామికవేత్తల అనుభవాలను తెలుసుకోవాలని సూచించారు. విజయవాడ కుశలవ ఇంటర్‌నేషనల్ కంపెనీ డైరెక్టర్ ఏఆర్‌కే చౌదరి పరిశ్రమల స్థాపనకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారు. కళాశాల చైర్మన్ సుంకర రామబ్రహ్మం, ప్రిన్సిపాల్ జీవీకేఎస్‌వీ ప్రసాద్ తదితరులు శిక్షణలో పాల్గొన్న విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులను అభినందించారు.