Share News

సంక్షేమరాజ్యం చంద్రబాబుకే సాధ్యం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:25 PM

రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో నిజమైన సంక్షేమ రాజ్యం రానుందని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కానూరు కేసీపీ కాలనీ, కానూరు ప్రధాన రహదారిలో ఆయన పర్యటించి మాట్లాడారు. కానూరులో మహిళలు ఆయనకు హారతులిచ్చి స్వాగతం పలికి ఆశీర్వదించారు.

 సంక్షేమరాజ్యం చంద్రబాబుకే సాధ్యం
కానూరులో ప్రచారం నిర్వహిస్తున్న బోడె ప్రసాద్‌, వెలగపూడి శంకరబాబు తదితరులు

పెనమలూరు, ఏప్రిల్‌ 25 : రాష్ట్రంలో చంద్రబాబు సారథ్యంలో నిజమైన సంక్షేమ రాజ్యం రానుందని టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కానూరు కేసీపీ కాలనీ, కానూరు ప్రధాన రహదారిలో ఆయన పర్యటించి మాట్లాడారు. కానూరులో మహిళలు ఆయనకు హారతులిచ్చి స్వాగతం పలికి ఆశీర్వదించారు. చంద్రబాబు హయాంలో అభివృద్ధి , సంక్షేమం జోడుగుర్రాల్లా పరిగెట్టనున్నాయని తెలిపారు. సైకో జగన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మద్యం, ఇసుక, గంజాయి మాఫియాలకు కేంద్రంగా రాష్ర్టాన్ని మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికాంలోకి వచ్చిన తర్వాత పార్టీలకతీతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షమ ఫలాలు దక్కేవిధంగా ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారు. తన హయాంలో నియోజకవర్గంలో మెట ల్‌ రోడ్లు, తారు రోడ్లు వేసిన తర్వాత ఇంతవరకు తట్టెడు మట్టి పోసిన దాఖలాలు లేవన్నారు. అప్పుడు వేసిన రోడ్లే ఇప్పుడు కూడా దర్శనమిస్తున్నాయని పేర్కొన్నారు. మద్య నిషేధం చేసి ఓట్లడుగుతానన్న జగన్‌ మాటతప్పి మడం తిప్పాడని ఎద్దేవా చేశారు. తొలి ఏడాదిలో పింఛను వెయ్యి పెంచుతానన్న జగన్‌ విడతల వారీగా పెంచడం మడమ తిప్పడం కాదా అని ప్రశ్నించారు. ఇంట్లో ఉన్న ప్రతి పిల్లాడికీ 15వేలు ఇస్తానన్న జగన్‌ ఒక్కరికే అదీ 13వేలు ఇవ్వడం మాట తప్పడం కాదా అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయిన విషయం నిజంకాదా అని ప్రశ్నించారు. బోడె ప్రసాద్‌ వెంట వెలగపూడి శంకరబాబు, యార్లగడ్డ సుచిత్ర, షేక్‌ బుజ్జి, ముప్పా రాజా, తాతపూడి గణేష్‌, అంగిరేకుల మురళి, దోనేపూడి రవికిరణ్‌, కొల్లి లక్ష్మి, కళ్యాణి, సీత, కొండ్రు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

పెడనలో ఛీ కొడితే పెనమలూరుకు..

కంకిపాడు : పెడనలో ఛీ కొడితే పెనమలూరు వచ్చిన జోగికి ప్రజలు ఓటు వేయరని పెనమలూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌ అన్నారు. ఈడుపుగల్లులో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి రాజేంద్రప్రసాద్‌, దేవినేని రాజాతో కలిసిన ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోడె ప్రసాద్‌ మాట్లాడుతూ, మైలవరం లో పోటీ చేసి ఓడిపోయిన జోగి ఆతరువాత పెడన వెళ్లాడన్నారు. అక్కడ ప్రజలు ఛీ కొడితే పెనమలూరు వచ్చి పడ్డాడని, మైలవరం, పెడనలో ఛీ కొట్టిన ప్రజ లు పెనమలూరులో గెలిపిస్తారా అన్నారు. ఇక్కడి ప్రజలు విజ్ఞత కలిగిన ప్రజలని అందుబా టులో ఉండే తననే గెలిపిస్తారన్న నమ్మకం తనకు ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీసీ నాయకులు గొంది శివరామకృష్ణ ప్రసాద్‌, తుమ్మ లపల్లి హరికృష్ణ, సర్పంచ్‌ పందిపాటి ఇందిర, కిలారు శ్రీను, షేక్‌ షకార్‌, ముక్కాముల శంకర్‌, పర్వత నేని రవి, పుట ్టగుంట రవి, మాబు సుబాని, సుధాకర్‌, చెల్లి సంగీ తరావు, నిరంజనరావు, రావి సురేష్‌ బాబు, చాట్ల ధర్మయ్య, అనుమోలు రామ కృష్ణ, సుంకర శ్రీహరి, మాధవ, వీరపనేని వెంకటేశ్వరరావు, జనసేన పార్టీ నాయకులు గంధం కృష్ణారావు, రవి, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:25 PM