Share News

పారిశుధ్యం..అధ్వానం

ABN , Publish Date - May 17 , 2024 | 12:53 AM

తాడిగడప మునిసిపాలిటీలోని క్లస్టర్లు తాడిగడప, పోరంకి, కానూరు, యనమలకుదురులో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. చెత్తను తొలిగించి బ్లీచింగ్‌ చల్లించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నారు.

పారిశుధ్యం..అధ్వానం
కానూరు సనత్‌నగర్‌ మూల వద్ద పేరుకుపోయిన చెత్తకుప్ప

తాడిగడప మునిసిపాలిటీలో పేరుకుపోయిన చెత్త కుప్పలు

పట్టించుకోని అధికారులు..దుర్గంధంతో అల్లాడుతున్న స్థానికులు

పెనమలూరు, మే 16: తాడిగడప మునిసిపాలిటీలోని క్లస్టర్లు తాడిగడప, పోరంకి, కానూరు, యనమలకుదురులో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. చెత్తను తొలిగించి బ్లీచింగ్‌ చల్లించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నారు. నిల్వ ఉన్న చెత్త కుప్పల వద్ద పందులు, కుక్కలు చేరి పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. తాడిగడప మునిసిపాలిటీలో రోజూ టన్నుల కొద్దీ చెత్త వస్తోంది. ఇంటింటికీ వెళ్లి సేకరించాల్సిన పారిశుధ్య సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తుండడంతో చెత్త రోడ్ల మీదే ఎక్కడికక్కడ రోడ్లు చెత్త డంపింగ్‌లుగా దర్శనమిస్తున్నాయి. చెత్త కుప్పలు తొలగించాలని, దుర్గంధం నుంచి తమకు విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 17 , 2024 | 12:53 AM