Share News

సంక్షోభంలో అభివృద్ధి, సంక్షేమం

ABN , Publish Date - Apr 22 , 2024 | 12:39 AM

వైసీపీ అరాచకపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సంక్షోభంలో పడిందని, బలహీన వర్గాల ఆర్థిక, సామా జికాభివృద్ధే ధ్యేయంగా ఎన్డీయే కూటమి ప్రకటించిన సూపర్‌సిక్స్‌, బీసీ డిక్లరేషన్‌ పథకాల రూపకల్పన జరి గిందని టీడీపీ గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. హనుమాన్‌జంక్షన్‌ ఇందిరా నగ ర్‌లో గడపగడపకు ప్రజాగళం కార్యక్రమంలో భాగం గా ఆదివారం ప్రచారం నిర్వహించారు.

 సంక్షోభంలో అభివృద్ధి, సంక్షేమం
అభయాంజనేయస్వామి ఆలయంలో యార్లగడ్డ వెంకట్రావు

హనుమాన్‌జంక్షన్‌రూరల్‌, ఏప్రిల్‌ 21 : వైసీపీ అరాచకపాలనలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సంక్షోభంలో పడిందని, బలహీన వర్గాల ఆర్థిక, సామా జికాభివృద్ధే ధ్యేయంగా ఎన్డీయే కూటమి ప్రకటించిన సూపర్‌సిక్స్‌, బీసీ డిక్లరేషన్‌ పథకాల రూపకల్పన జరి గిందని టీడీపీ గన్నవరం కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. హనుమాన్‌జంక్షన్‌ ఇందిరా నగ ర్‌లో గడపగడపకు ప్రజాగళం కార్యక్రమంలో భాగం గా ఆదివారం ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, ఇందిరానగర్‌ సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తదనంతరం సూపర్‌సిక్స్‌ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీడీపీ హయాంలో తెచ్చిన 27 దళిత అభ్యున్న తిపథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని, ఎస్సీ, బీసీ సబ్‌ప్లాన్‌ నిధులను దారిమళ్లించి ఆయా వర్గాల ను మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చాక అధికారుల ద్వారా మాత్రమే 15వేల మందికి ఇంటిప ట్టాలను అందజేస్తానన్నారు. గన్నవరం నియోజకవర్గ నాయకుడు చెత్తమాటలతో చంద్రబాబు నాయుడు కన్నీటి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్య కర్తలు సమన్వయంతో కలిసికట్టుగా కృషిచేసి ఎన్డీఏ కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపిం చాలని కోరారు. ఈ కార్యక్రమంలో చలమలశెట్టి రమేష్‌బాబు, అట్లూరి శ్రీనివాస్‌, చిరుమామిళ్ల సూర్యం, దాసరి బెనర్జీ, వరిగంజి కిషోర్‌, చీలి అనంద్‌, గార్లపాటి రాజే శ్వరరావు, శ్రీపతి శిరీష, వీరమాచనేని సత్యప్రసాద్‌, సువర్ణరా జు, సూర్యావతి, బీజేపీ నాయకులు తోట మురళీధర్‌, ఫణికుమార్‌, భాస్కర్‌ పాల్గొన్నారు.

ప్రచారంపై ఈసీ నిఘా

హనుమాన్‌జంక్షన్‌లో నిర్వహిస్తున్న ఏన్డీయే కూటమి అభ్యర్థుల ప్రచారంపై ఈసీ నిఘా వేసింది. సీసీ కెమెరా అమర్చిన కారు యార్లగడ్డ వెంకట్రావు ప్రచారంలో హనుమాన్‌జంక్షన్‌ కూడలి నుంచి ఇందిరా నగర్‌లోని అంతర్గత రహదారుల్లో కూడా నీడలా వెంటాడింది. బందరు పార్లమెంటు అభ్యర్థి బాలశౌరికి చెందిన డిజిటల్‌ డిస్ల్పే గల ప్రచారం రథాన్ని ఆపి టార్చిలైట్ల వెలుగులో అనుమతి పత్రాలను తనిఖీ చేశారు. అనుతిచ్చిన అధికారి సంతకం నిజమా కాదా అని తీక్షణంగా పరిశీలించడం జరిగింది. అనుమతి ఇచ్చిన సమయం, ప్రాంతంలో మాత్రమే ప్రచారం చేయాలని డ్రైవరుకు సూచించారు.

వైసీపీ నుంచి టీడీపీలోకి..

ఉంగుటూరు : వైసీపీ అప్రజాస్వామిక విధానాల తో విసుగెత్తిపోయిన ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు, చంద్రబాబు సమర్థ నాయకత్వంపట్ల నమ్మకముంచి వైసీపీని వీడి టీడీపీలోకి చేరుతున్నారని గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మె ల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. మండ లంలోని ఇందుపల్లికి చెందిన నేతలు ఉయ్యూరు మురళి, వేణు అధ్వర్యంలో 22మంది వైసీపీ నాయ కులు ఆదివారం యార్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరా రు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన యార్లగడ్డ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం నుంచి రాష్ట్రాన్ని రక్షించడానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడిన విష యాన్ని దృష్టిలో వుంచుకుని ప్రతి ఒక్కరూ కూటమి విజయానికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

Updated Date - Apr 22 , 2024 | 12:39 AM